English | Telugu

క‌నిపించ‌ని ఖుషీ...వేద‌ని నిల‌దీసిన య‌ష్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. కైలాష్ ఇష్యూ కార‌ణంగా ఇంటి నుంచి వెళ్లిపోయి త‌ల్లిదండ్రుల‌తో వుంటున్న వేద‌ని తిరిగి ఇంటికి ర‌మ్మ‌ని య‌ష్ తండ్రి ర‌త్నం వెళ్లి అడుగుతాడు. అయితే వేద మాత్రం అందుకు అంగీక‌రించ‌దు. య‌ష్ వ‌చ్చి పిలిస్తేనే వ‌స్తాన‌ని చెబుతుంది.

దీంతో ర‌త్నం వెనుదిరిగి వెళ్లిపోతాడు. విష‌యం తెలిసి య‌ష్ ఊగిపోతాడు. ఇంత‌లో ఒక భార్య భ‌ర్త నుంచి కోరుకునే ఎఫెక్ష‌న్ ని త‌ను నీ నుంచి కోరుకుంటోంది. ఒక్క‌సారి వెళ్లి ర‌మ్మ‌ను నువ్వు వెళ్లి వ‌చ్చేస‌రికికి నీకు ఎదురుప‌డుతుంది` అంటాడు ర‌త్నం. ఆ మాట‌లు విన్న ఖుషీ ..ఇంట్లో నుంచి మ‌మ్మీని ఎందుకు పంపించేశావ్ నీతో క‌టీఫ్ అని య‌ష్ తో అంటుంది. ఎక్క‌డికి వెళ్లినా మ‌మ్మి నీకు చెప్పి వెళుతుంది. అమ్మ‌మ్మ వాళ్లింటికి వెళ్లిన మ‌మ్మీని నువ్వే వెళ్లి పిలుచుకురా అంటుంది య‌ష్ తో. కానీ య‌ష్ ఆ మాట‌లు ప‌ట్టించుకోడు.

క‌ట్ చేస్తే ఖుషీ .. వేద కోసం వెళుతుంది. నువ్వు, నేను, డాడీ ఒక పార్టీ క‌దా..ఎందుకు మ‌మ్మల్ని వ‌దిలేసి ఇక్క‌డికి వ‌చ్చావ్‌..? నాకూ, డాడీకి నువ్వు కావాల‌మ్మా.. ఇంటికి రామ్మా అంటుంది. కానీ వేద విన‌దు. నాకు కోపం వ‌స్తుంది. 1.2.3 అని ఎక్క‌పెడ‌తాను.. నువ్వు ఇంటికి వ‌చ్చే పని అయితే ఖుషీ అని పిలువు.. లేదంటే వెళ్లిపోతాను అంటుంది. అయినా వేద పిల‌వ‌దు. దీంతో ఖుషీ హ‌ర్ట్ అయి అపార్ట్ మెంట్ బ‌య‌టికి వెళ్లిపోతుంది. మాలిని ఖుషీ కోసం ఇల్లంతా వెతుకుతూ వుంటుంది. వేద ద‌గ్గ‌ర కూడా లేద‌ని చెప్ప‌డంతో య‌ష్ వెళ్లి వేద‌ని నిల‌దీస్తాడు. త‌ను అడిగినా రావా అంటాడు. త‌న‌కి ఏదైనా జ‌రిగితే నిన్ను క్ష‌మించ‌ను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌ర‌గింది? ఖుషీ ఎటు వెళ్లింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.