English | Telugu
డబ్బులు ఆఫర్ చేస్తే ఎందుకు తీసుకోలేదు?
Updated : Dec 22, 2022
బిగ్ బాస్ సీజన్-6 లో టాప్-3 లో నిలిచిన కీర్తి భట్.. ఎగ్జిట్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
"ఎలా ఉంది టాప్-3 ఫీలింగ్? మాములుగా లేదు కదా" అని యాంకర్ అడిగాడు. "అమేజింగ్ ఫీలింగ్. అసలు తగ్గేదేలే" అని చెప్పింది కీర్తి. "అసలు టాప్-3 లో ఉంటావని ఊహించావా? ఏ పొజిషన్ లో ఉంటావని అనుకున్నావ్" అని యాంకర్ ప్రశ్నించాడు. " అసలు టాప్-3 లో ఉంటానని అనుకోలేదు. 7 or 8 పొజిషన్ లో ఉంటానని అనుకున్నాను" అని కీర్తి సమాధానమిచ్చింది. ఆ తర్వాత "డబ్బులు ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా? ఎందుకు తీసుకోలేదు" అని అడిగాడు యాంకర్. "నేను వద్దని అనుకున్నాను. ఎలాగైతే బయటకు రావాలని అనుకున్నానో అలాగే బయటకొచ్చాను" అని కీర్తి అంది.
"ఇన్ని వారాల్లో ఎప్పుడైనా.. మీకు భయం వేయలేదా? అంటే బాగా గేమ్ ఆడేవాళ్ళు, టాస్క్ లు బాగా పర్ఫామెన్స్ చేసేవాళ్ళు, అందరూ బయటకు వచ్చేస్తుంటే మీకు భయం వేయలేదా?" అని యాంకర్ అడిగాడు. "మొదట్లో కొంచెం భయం అనిపించేది. కానీ పోను పోను ఇక అంతలా ఏం అనిపించలేదు. ఎక్కడో ఒక మూలన ఏం వచ్చినా ఓకే అన్నట్టుగా ఉన్నాను" అని కీర్తి అంది. "శ్రీసత్య నిన్ను అలా వెక్కిరించింది కదా.. మీకెలా అనిపించింది. తను ఎందుకు అలా అంది? మీరేందుకు అలా రియాక్ట్ అయ్యారు?" అని యాంకర్ అడిగాడు. "శ్రీసత్యతో ఒక గేమ్ గురించి మాట్లాడినప్పుడు.. తను అటిట్యూడ్ చూపించింది. ఆ తర్వాత తనకి ఎదురు తిరిగి మాట్లాడానని.. నన్ను ఇమిటేట్ చేసింది. అది నేను తీసుకోలేకపోయాను" అని చెప్పుకొచ్చింది కీర్తి.