English | Telugu
ఇనయా నిన్నే ఎందుకు టార్గెట్ చేసింది?
Updated : Dec 22, 2022
బిగ్ బాస్ సీజన్-6 లో రన్నర్ గా నిలిచిన శ్రీహాన్.. ఎగ్జిట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.
యాంకర్ "డబ్బులు ఆఫర్ చేస్తుంటే మొదట వద్దు అన్నావ్. మళ్ళీ ఎందుకు తీసుకున్నావ్?" అని అడిగాడు. "నాతో ఉన్న హౌస్ మేట్స్ దాదాపుగా అందరూ డబ్బులు తీసుకోమనే అన్నారు. నేను మొదటి నుండి వద్దు అనే ఉన్నాను. ఇక నేను మా నాన్న డెసిషన్ కోసం వెయిట్ చేసాను. ఎప్పుడు అయితే మా నాన్న తీసుకోమన్నాడో.. అప్పుడు ఫిక్స్ అయ్యాను. ఇక వేరే ఆలోచించకుండా తీసుకున్నాను" అని సమాధానమిచ్చాడు. "శ్రీసత్యకి, నీకు మధ్య ఏం ఉంది. అన్నా చెల్లెళ్ళా? లేక ఇంకేమైనా ఉందా?" అని యాంకర్ అడిగాడు. "మా మధ్య ఏం లేదు. అలా అని అన్నా చెల్లెళ్ళు కాదు. కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్" అని శ్రీహాన్ చెప్పాడు. "ఏం సిరి విన్నావా.. శ్రీహాన్ ఏమన్నాడో" అని యాంకర్ నవ్వుతూ అన్నాడు. దీంతో శ్రీహాన్ "ఇక నువ్వు కానియ్" అని అన్నాడు.
"ఇనయా ఎందుకు నిన్నే టార్గెట్ చేసింది?.. నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేసావ్?" అని యాంకర్ అడిగాడు. దానికి రిప్లై ఇస్తూ "నేను ఏం అన్నా.. తను వేరేలా తీసుకుంటుంది. దాని బదులు రియాక్ట్ అవ్వకుండా కామ్ గా ఉంటే బెటర్ అని అనుకున్నాను. ఆ తర్వాత ఎందుకురా ఈ పిల్లతో అని వదిలేసా" అని చెప్పాడు శ్రీహాన్. "శ్రీసత్య ఏం చెప్తే అది చేస్తావ్ కదా?" అని యాంకర్ ప్రశ్నించాడు. "ఏం చెప్తే కాదు. కొన్ని చిన్నవి ఉంటాయి. చికెన్, ఎగ్, ఫుడ్ ఇలాంటివి. వాటిలో చేసేవాడిని కాని, టాస్క్ ల పరంగా కానీ, హౌస్ పరంగా కానీ, వేరే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో.. వాటిని నేను ఫాలో అవ్వను" అని చెప్పాడు.