English | Telugu
యాంకరింగ్ ని అవమానించిన యాంకర్ రవి.. అవార్డు వద్దని వెళ్ళిపోయిన అకుల్ బాలాజీ!
Updated : Dec 22, 2022
ఏడాది చివరికి వచ్చేసింది. కొత్త కొత్త షోస్ హంగామా చేస్తున్నాయి. అందులో ఇప్పుడు బుల్లితెర మీద అవార్డ్స్ ఫంక్షన్ ఈవెంట్ ఒకటి రాబోతోంది. అదే జీ తెలుగులో ‘ఫెంటాస్టిక్ అవార్డ్స్’ అనే ఒక షో జరగబోతోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి, బిగ్ బాస్ సిరి హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి 6 గంటలు ప్రసారమయ్యే ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఫెంటాస్టిక్ అవార్డులలో భాగంగా అవార్డుల పేర్లు కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో ఈ ఏడాది బెస్ట్ యాంకర్ అవార్డును యాంకర్, నటుడు, డాన్స్ ఇండియా డాన్స్ షోని హోస్ట్ చేస్తున్న అకుల్ బాలాజీని వరించినట్లు తెలుస్తోంది. అయితే.. అకుల్ బాలాజీని బెస్ట్ యాంకర్ అవార్డు అందుకోవడానికి రావాలంటూ పిలిచాడు. ఆయన్ని ‘వాగుడు వీరయ్య’ అని సంబోధిస్తూ స్టేజి మీదకు పిలిచాడు. ‘యాంకరింగ్ ని వాగుడు అనడం బాలేదని.. అందుకు తాను ఈ అవార్డును తీసుకోలేనని చెప్పి సీరియస్ గా స్టేజ్ దిగి అక్కడినుండి వెళ్ళిపోయాడు".