English | Telugu
బిగ్ బాస్ చరిత్రలో సీజన్ 7 రికార్డు.. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరుగలేదు!
Updated : Dec 4, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ఎవరు ఊహించని విధంగా చివరి నామినేషన్ ముగిసింది. కంటెస్టెంట్స్ మధ్య వాడీ వేడీ ఆర్గుమెంట్స్ జరిగాయి. హౌస్ లో ఉన్నవాళ్ళంతా నామినేషన్ లో ఉన్నారు. అమర్‌దీప్, ప్రశాంత్ ల మధ్య జరిగిన గొడవతో హౌస్ లో ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక, శివాజీల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.
నామినేషన్స్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. "ఈ ఫినాలే రేస్ మిమ్మల్ని ఒక ఫైనలిస్ట్‌ను చేస్తుంది లేదా ఫినిష్ లైన్ దగ్గర ఆపేస్తుంది. అది ప్రేక్షకుల చేతిలోనే ఉంది. వాళ్లు మీ ప్రతి ఆట, ప్రతీ మాట, ప్రతీ కదలికను చాలా దగ్గరి నుంచి గమనిస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని.. మీ గెలుపు, ఓటములను నిర్ణయిస్తుంది. బిగ్‌బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇప్పటి నుంచి ఫినాలే వరకు.. అంటే రెండు వారాల కోసం మీ అందరి ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. ఈ రెండు వారాల సమయంలో అందరికంటే ఎక్కువ ఓట్స్ పొందిన వారు సీజన్ 7 విన్నర్ అవుతారు" అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.
అలానే ఒక వేళ ఈ వారం ఎవరి ఓట్స్ మిగిలిన వారి కంటే తక్కువగా ఉంటాయో వారు ఎలిమినేట్ అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అర్జున్ ఓటింగ్ లైన్స్ కూడా ఇప్పటి నుంచే తెరుచుకున్నాయని కానీ ఫినాలే టికెట్ పొందడంతో ఎలిమినేషన్ నుంచి అర్జున్ సేఫ్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంటే దీన్ని బట్టి.. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఎవరు కావాలనుకుంటున్నారనేది జనాల చేతిలో ఉందని చెప్పారన్నమాట. ఇక నిన్నటి నుంచి డిసెంబర్ 15 అర్ధరాత్రి 12 గంటల వరకు రెండు వారాల పాటు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు.