English | Telugu
Brahmamudi : నిజం బయటకు రాకూడదని మాయని కారుతో ఆక్సిడెంట్ చేసిన రుద్రాణి!
Updated : Jun 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -426 లో... కావ్య గురించి అనామిక తప్పుగా మాట్లాడుతుంటే కళ్యాణ్ కి కోపం వస్తుంది. నువ్వు కోటి జన్మలు ఎత్తినా కూడా మా వదినని అర్థం చేసుకోలేవని అనామికని కళ్యాణ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఇంత కష్టపడి ప్లాన్ చేసి బట్టలు సర్దకున్న కానీ రాజ్ గదిలోకి వెళ్లలేకపోయానని మాయ చిరాకు పడుతుంటే.. నువ్వు ఒకరకంగా సక్సెస్ అయ్యావ్.. పెళ్లి అయిన తర్వాత పంపిస్తానని వదిన చెప్పింది కదా.. ఈ మాత్రం సాధించవంటే గ్రేట్ కదా అని మాయతో రుద్రాణి అంటుంది.
అప్పుడే కావ్య వచ్చి.. మీరేదో సాధించానని అనుకుంటున్నారు. మీరేం చేసిన ఈ పెళ్లి మాత్రం జరగదని కావ్య అనగానే.. ఓడిపోతావని తెలిసినా ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావని రుద్రాణి అంటుంది. కాబోయే భార్యగా హక్కు కోసం పోరాడావు కానీ ఈ బిడ్డకి తల్లి గా నీ బాధ్యత నీకుంటుంది కదా అని బాబుని మాయకి ఇచ్చి వెళ్తుంది కావ్య.ఆ తర్వాత అందరు హాల్లోకి వస్తారు. పంతులు గారు కూడా వస్తారు. దగ్గరలో పెళ్లి ముహూర్తం ఉంటే చెప్పండని అపర్ణ అనగానే.. కన్య పేరు ఏంటని పంతులు అడుగుతాడు. అది కన్య కాదు.. కుమారి కాదు.. దానికి పేరు.. కళ్యాణ్ నీ కవి బాషలో చెప్పమని స్వప్న అనగానే.. ఆ సౌభాగ్యవతి మాతా.. మాయ అని కళ్యాణ్ చెప్తాడు. అబ్బాయి పేరు అని పంతులు అడుగగా.. రాజ్ అని అపర్ణ అంటుంది. అది విని పంతులు షాక్ అవుతాడు. కావ్య ఉంది కదా అని పంతులు అడుగుతాడు. ఇది రెండో పెళ్లి అని స్వప్న చెప్తుంది. రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. దాంతో మాయ, రుద్రాణి ఇద్దరు హ్యాపీగా ఫీలవుతారు.
ఇదంతా ఏంటని కావ్యతో సుభాష్ అనగానే.. రెండు రోజులు ఓపిక పట్టండి అని కావ్య అంటుంది. ఎందుకిలా చేస్తున్నావని రాజ్ అనగానే.. మరి మీరు పెళ్లి రోజున ఆ బాబుని ఎందుకు ఎత్తుకొని వచ్చారని కావ్య అడుగుతుంది. ఆ తర్వాత అప్పు ఫోన్ చేసి బయల్దేరావా అని అడుగుతుంది. అసలు నువ్వు కనుక్కుంది నిజమైన మాయానేనా అని కావ్య అంటుంది. అది అంత రుద్రాణి వింటుంది. అసలు మాయని తీసుకొని వచ్చి అసలు నిజం చెప్పించాలి అనుకుంటున్నావా.. అది జరగనివ్వనని రుద్రాణి అనుకుంటుంది. అప్పు దగ్గరికి కావ్య వెళ్తుంటే రుద్రాణి కూడా ఫాలో అవుతుంది. తరువాయి భాగంలో కావ్య, అప్పులు మాయ దగ్గరికి వెళ్తారు. మాయ వాళ్ళని చూసి పరిగెడుతుంది. మాయ పరిగెడుతుంటే మాయని రుద్రాణి కార్ తో ఆక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది. కావ్య, అప్పు ఇద్దరు మాయ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.