English | Telugu

లాస్ట్ మినిట్ లో ఫిట్టింగ్ పెట్టిన జ్యోత్స్న.. కార్తీక్ ఏం చేస్తాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటిఎపిసోడ్ -436 లో..... సుమిత్రని దీప, కార్తీక్ ల పెళ్లి జరగడానికి ఒప్పిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత అందరు గదిలో నుండి బయటకు వస్తారు. పెళ్లికి రెండు రోజుల్లో ముహూర్తం పెడతారు. అందరు హ్యాపీగా ఉన్న టైమ్ లో.. ఇప్పుడు అసలు మొదలు అయింది ఇంకా మాట్లాడుకోవాలి కదా అని జ్యోత్స్న అంటుంది.

ఇంకా ఏంటని అందరు అడుగుతారు. దీపకి అమ్మనాన్న లేరు కాబట్టి వాళ్ళ అమ్మనాన్న ప్లేస్ లో మా అమ్మ నాన్న కూర్చొని చేస్తున్నారు. అక్కడ తాంబూలం ఎవరికి ఇస్తారు కార్తీక్ అమ్మ నాన్న అయిన అత్తయ్య మావయ్య కి ఇస్తారు కదా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు జరిగిన గొడవలు అన్ని తెలిసే ఇలా అడుగుతున్నావా అని కార్తీక్ కోప్పడుతాడు. అదేం లేదు వాళ్ళు లేకుంటే పెళ్లి ఎలా జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. దాన్ని శివన్నారాయణ సమర్దిస్తాడు. మీరు పిలుచుకోండి అని శివన్నారాయణ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు.

ఆ తర్వాత ఈ పెళ్లి ఇష్టం లేక జ్యోత్స్న ని ఇలా ముందు పంపి ఇలా అడిగేలా చేసారని అనసూయ అంటుంది. వద్దు బావ వెళ్లి గుళ్లో పెళ్లి చేసుకుందామని దీప అనగానే తనపై కార్తీక్ కోప్పడతాడు. కాసేపటికి నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళమని చెప్పి దీపని పంపిస్తాడు. ఆ తర్వాత దీప ఒక్కతే శివన్నారాయణ ఇంటికి వెళ్తుంది. దీపని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..