English | Telugu

కార్తీక్ కండిషన్ ని కాదన్న సుమిత్ర.. ఆమె నిర్ణయానికి వాళ్ళిద్దరు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -432 లో..... దీపకి అమ్మనాన్నల స్థానంలో మీరు ఉండి మాకు మళ్ళీ పెళ్లి చేయాలని సుమిత్ర, దశరథ్ లతో కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. ఒక మనిషిగా కూడా తన పక్కన నిల్చోవడానికి ఇష్టపడను అలాంటిది తల్లి స్థానంలో అంటున్నావ్ అది జరగదని సుమిత్ర అక్కడ నుండి వెళ్లిపోతుంది.

ఇప్పుడే చెప్పావ్ కదా.. కాస్త టైమ్ ఇవ్వు అని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. ఆ పారిజాతం, జ్యోత్స్న పైకి వెళ్లి ఎందుకు ఇలాంటి కోరిక కోరాడని ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు ఎందుకు బావ అలాంటి కోరిక కోరావని కార్తీక్ ని దీప అడుగుతుంది. ఒక ప్రయత్నం చేసానని కార్తీక్ అంటాడు. మరొకవైపు ఎందుకిలా చేసావని సుమిత్రతో దశరథ్ అంటాడు. మావయ్య గారు దీనికి ఒప్పుకుంటారనుకుంటున్నారా అని సుమిత్ర అంటుంది. అక్కడ ఆయనకి ఎక్కడ గౌరవం ఇచ్చామని దశరథ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. వాడిని మనమే అడగమన్నాం.. మనం ఆలోచించాలని శివన్నారాయణ అంటాడు.

ఏం ఆలోచించినా కూడ నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదని సుమిత్ర చెప్తుంది. దాంతో శివన్నారాయణ, దశరథ్ షాక్ అవుతారు. మరొకవైపు కార్తీక్ కి దీప టీ తీసుకొని వెళ్తుంటే పారిజాతం ఆపి అది తీసుకొని తాగుతుంది. ఏదైనా నాకు లాక్కొవడం అలవాటు అని పారిజాతం అంటుంది. టీ తాగి ఛీ ఇలా ఉందేంటని అంటుంది. మిర్యాల ఛాయ్ అని దీప అంటుంది. అప్పుడే కార్తీక్, జ్యోత్స్న వస్తారు. నీకు ముందే బావ కండిషన్ గురించి తెలుసు కదా అని దీపతో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..