English | Telugu

యామినికి వార్నింగ్.. కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -796 లో... కావ్య దగ్గరికి రాజ్ రాగానే యామిని ఎంట్రీ ఇస్తుంది. మా బావని వద్దని అనడానికి కారణం చెప్పమని కావ్యని యామిని అడుగుతుంది. కళావతి ఎందుకు రిజెక్ట్ చేసిందో నాకు తెలియదు గాని తప్పకుండా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కానీ మీరందరు నాపై చూపిస్తున్న ప్రేమకి ఇక్కడే ఉండిపోవాలని ఉందని రాజ్ అంటాడు. యామిని తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది.

మీ బావని ఇక్కడ ఏం ఉంచుకోములే.. నువ్వు వెళ్ళమని యామినితో ఇందిరాదేవి అంటుంది. యామిని కోపంగా వెళ్ళిపోతుంది. తన వెనకాలే కావ్య వెళ్లి.. ఏంటి ఎక్సట్రాలు చేస్తున్నావ్ త్వరలోనే నీ నిజస్వరూపం ఆయనకు తెలిసేలా చేస్తానని యామినికి కావ్య వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు రేవతి తన తమ్ముడు తన దగ్గరున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి కలిసి రాజ్ ని తిడతారు తాను రిజెక్ట్ చేసిందని నువ్విలా చెయ్యడం కరెక్ట్ కాదని అంటారు.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్తాడు. యామిని హాల్లో కూర్చొని ఉంటుంది. నిన్ను వద్దని అంది అంటే.. తనకి నువ్వు అంటే ఇష్టం లేదని యామిని అంటుంది. లేదు తనకి ఇష్టం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎందుకు వద్దని అంటుందో కారణం తెలుసుకుంటానని రాజ్ అంటాడు. మరుసటిరోజు అపర్ణకి చెప్పి కావ్య హాస్పిటల్ కి వెళ్తుంది. తరువాయి భాగం లో కావ్య హాస్పిటల్ కి వెళ్తుంటే రాజ్ చూసి ఫాలో అవుతాడు. కావ్య డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. లోపల బేబీ ఒకే కంగ్రాట్స్ అని డాక్టర్ అనగానే కావ్య థాంక్స్ అంటుంది. అదంతా రాజ్ విని షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.