English | Telugu
బ్రహ్మముడి కావ్య దెబ్బకి కార్తీకదీపం దీప పరార్!
Updated : Jun 22, 2024
తెలుగు టీవీ సీరియళ్ళలో స్టార్ మా టీవీ సీరియల్స్ కి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న సీరియల్స్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నవే కావడం విశేషం. అయితే ఈ వారం టాప్-5 లో ఉన్న సీరియల్స్ గురించి చూసేద్దాం....
ఈ వారం టీఆర్పీలో అగ్రస్థానంలో 'బ్రహ్మముడి' నిలిచింది. రెండవ స్థానంలో 'కార్తీకదీపం-2', మూడవ స్థానంలో 'ఇంటింటి రామాయణం' ఉండగా.. నాల్గవ స్థానంలో ' గుండె నిండా గుడిగంటలు', అయిదవ స్థానంలో ' నువ్వు నేను ప్రేమ' ఉన్నాయి. కార్తీకదీపం-2 కథ మొత్తం మారిపోయింది. అసలు దీప, కార్తిక్ మెయున్ లీడ్ గా ఉండగా.. వారికి సంబంధం లేకుండా కథ సాగడంతో ఈ సీరియల్ కి అభిమానులు తగ్గిపోయారు. శౌర్య ఎమోషనల్ డ్రామా ఉన్నప్పటికీ.. దీపకి నరసింహా అనే మరో వ్యక్తితో పెళ్ళి జరగడం, అతను వదిలేసి సిటీకి వచ్చి మరో పెళ్ళి చేసుకోవడం .. ఇదేదో లవ్ మాక్ టెయిల్ లా ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు. కథలో కొత్త పాత్రలు ఎక్కువగా ఉండటం.. అవన్నీ కలిసి దీప, కార్తిక్, శౌర్యలని డామినేట్ చేసేలా ఉండటం వల్లే ఈ సీరియల్ టీఆర్పీలో సెకెండ్ ప్లేస్ లో ఉంది. మరి ఎప్పటిలాగే బ్రహ్మముడి టాప్ లో దూసుకెళ్తుంది. కథలో ఎన్ని కొత్త పాత్రలొచ్చిన కావ్య లీడింగ్ అనేది ఈ కథలో ప్రదానంగా కనపడుతుంది. దాంతో కథ మీద ఆసక్తి కలుగుతుంది.
ఇక మూడవ స్థానంలో కొత్తగా మొదలైన ఇంటింటి రామాయణం ఉంది. కథ సింపుల్ గా అలా వెళ్తూ ఉండటమే దీనికి కారణం. ఓ కుటుంబంలో సాగే ప్రేమ, అభిమానం, కలుపుగోలుతనం ఇవన్నీ ఈ సీరియల్ లో పుష్కలంగా ఉండటమే దీనిని ఎక్కువ మంది చూసేలా కథనం సాగుతుంది. నాల్గవ స్థానంలో గుండె నిండా గుడిగంటలు సాగుతుంది. ఈ సీరియల్ కి కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉంది. అయిదవ స్థానంలో నువ్వు నేను ప్రేమ సీరియల్ సాగుతుంది. ఈ సీరియల్ లో అమాయకపు భార్య, తెలివైన భర్త అనే థీమ్ తో నడుస్తుంది. అయితే ఈ సీరియల్ మొదట్లో చాలా తక్కువ టీఆర్పీతో ఉండేది. కానీ ఈ సీరియల్ అనూహ్యంగా విశేష జనాదరణ పొందింది. ఇప్పుడు టాప్-5 లో ఈ సీరియల్ ఉండటం విశేషం.