English | Telugu
గర్భసంచి లోపం ఉంది.. పిల్లలు పుట్టరు!
Updated : Jun 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -75 లో.....శోభ ప్రెగ్నెంట్ అని అనసూయ, నర్సింహలు హ్యాపీగా ఫీల్ అవుతూ హాస్పిటల్ కి తీసుకొని వస్తారు. అక్కడే దీప ఎదురవుతుంది. శోభ ప్రెగ్నెంట్ అన్న విషయం అనసూయ చెప్పబోతుంటే.. వద్దని నర్సింహ అంటాడు. ఇలాంటి విషయాలు అందరికి చెప్పుకోవాలని శోభ అనగానే.. తన కోడలు తల్లి కాబోతున్న విషయం అనసూయ చెప్తుంది. నేను నానమ్మ కాబోతున్నానని అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతు చెప్తుంది. నా మనవడు వస్తాడు. వాడే నా కొడుకు.. వారసుడు. అయిన నీ కూతురికు తండ్రిని అంటు ఎవరైనా సంతకం పెడుతారులే అని అనసూయ అనగానే.. దీప కోప్పడుతుంది.
మీకు హ్యాపీగా ఉంటే పండగ చేసుకోండి అంతే గాని నా కూతురు జోలికి గానీ నా జోలికి గానీ రాకని వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు జ్యోత్స్న ఫ్రెండ్ జ్యోత్స్నకి ఫోన్ చేసి.. నీకు మీ బావపై డౌట్ కదా అందుకే ఇలా మీ బావ వస్తే చెప్పామని అంటున్నావ్. ఇక్కడికి వస్తే నేను చెప్తాను. మరి హోటల్ కి వెళ్తే ఎవరు చెప్తారని తన ఫ్రెండ్ అనగానే జ్యోత్స్న తనపై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. ఒక ప్రశ్నకి సమాధానం కావాలి. శౌర్యని మా బావకి ఎందుకు దగ్గర చేస్తున్నావని అడుగుతుంది. నీకు చెప్పకుండా శౌర్య ఏం పని చేయదు అలాంటి శౌర్య.. నువ్వు చెప్పకుండా దగ్గర అవుతుందా? పేరెంట్స్ మీటింగ్ కి నేనే నా కూతురిని తీసుకొని వెళ్తున్నానని అన్నావ్.. మరి అక్కడికి మా బావ ఎలా వచ్చాడు. ఇంకొక ప్రశ్న అడుగుతాను.. నా బావే నా కాబోయే భర్త అని తెలుసు. మీరు పేరెంట్స్ మీటింగ్ లో ఉండగా ఎవరైనా వచ్చి చూస్తే మీరే పేరెంట్స్ అనుకుంటారు కదా.. ఇది స్కూల్ లో అడుగుదామని అనుకున్నాను. మా బావ ముందు ఎందుకని అడగలేదని జ్యోత్స్న అంటుంది. నేను సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో లేనని దీప అంటుంది.
మా బావ ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడంటూ దీపకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. మరొకవైపు శోభ కి టెస్ట్ లు చేస్తుంది డాక్టర్. అన్ని రిపోర్ట్స్ చూసి తను ప్రెగ్నెంట్ కాదని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఇంకొక విషయమంటూ డాక్టర్ చెప్తుంది. తనకి గర్భసంచి లోపం ఉంది. పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పగానే.. శోభ ఏడుస్తుంది. ఆ దీప ఎదరు వచ్చింది ఇలా జరిగిందని శోభ అంటుంది. అప్పుడే కానిస్టేబుల్ నరసింహకి ఫోన్ చేసి.. నువ్వు బైక్ కి ఆక్సిడెంట్ చేసినతను నీ మీద కేసు పెట్టాడు త్వరగా రా అని చెప్తాడు. ఆ తర్వాత నరసింహ కానిస్టేబుల్ తో మాట్లాడుతుంటే.. కార్తీక్ చూస్తాడు. దీపని ఏమైనా ఇబ్బంది పెడితే తను కేసు పెట్టిందా కనుక్కోవాలంటూ దీప దగ్గరికి వెళ్తాడు. ఆ నర్సింహా కానిస్టేబుల్ తో ఉన్నాడు.. నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాడా దీప అని కార్తిక్ అడుగుతాడు. ఇబ్బంది పెడితే మీకేంటి అని దీప సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.