English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి, ‌సీతాకాంత్ ల పెళ్ళి జరిగింది.. అంతా దైవ నిర్ణయమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -119 లో..... అభితో రామలక్ష్మి లేచిపోయిందని శ్రీలత అంటుంది. దాంతో నా కూతురు అలాంటిది కాదు.. కుటుంబం కోసం ప్రాణం ఇస్తుంది తప్పా.. ఇలా పరువు తక్కువ పని అసలు చెయ్యదని రామలక్ష్మి తల్లి సుజాత ఎమోషనల్ అవుతుంది. మా అక్క గురించి తప్పుగా మాట్లాడకండి అని ధన అంటాడు. అయితే అంత పద్ధతి గల అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్లినట్లు చెప్పండి అని శ్రీలత అంటుంది. రామలక్ష్మి లేచిపోలేదు.. అలా తెలివి తక్కువ పని తను ఎప్పటికి చెయ్యదని సీతాకాంత్ గట్టిగా అరుస్తాడు.

అయితే రామలక్ష్మి ఎక్కడుందో నీకు తెలుసు.. ఎక్కడికి వెళ్ళింది చెప్పు అల్లుడు అని మాణిక్యం నిలదీస్తాడు. సీతాకాంత్ కాలర్ పట్టుకొని మాణిక్యం అడుగుతాడు. చెప్తానంటూ అసలు రామలక్ష్మి నాకు పెళ్లి అని సీతాకాంత్ అనగానే.. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. పెళ్లి అయింది అంటూ వస్తుంది. ఇప్పుడు అందరి ముందు మరొకసారి సీతాకంత్ సర్ నా మెడలో తాళి కట్టబోతున్నాడని రామలక్ష్మి అంటుంది. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ అమ్మ అని మాణిక్యం అడుగుతాడు. ఆ అభి గాడు నన్ను కిడ్నాప్ చేసాడని రామలక్ష్మి చెప్తుంది. అప్పుడే ముహూర్తానికి టైమ్ అవుతుంది అని పంతులు పిలుస్తాడు. సీతాకాంత్ ఆలోచిస్తుంటే.. నువ్వేం ఆలోచించకు.. ఇది దైవ నిర్ణయమని స్వామి అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి మెడలో సీతాకాంత్ తాళి కడుతాడు. మీరు తలదించుకొనే పని నేనెప్పుడూ చెయ్యనని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రామలక్ష్మి కళ్ళు తిరిగిపడిపోతుంది. దాంతో గదిలోకి తీసుకెళ్లి డాక్టర్ ని రమ్మని చెప్తారు.

ఆ తర్వాత డాక్టర్ వచ్చి రామలక్ష్మి కి ట్రీట్ మెంట్ చేస్తుంది.‌సుజాత బాధపడుతుంటే మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య అని సిరి అంటుంది. దీనికి కారణమైన వాళ్ళని అసలు వదిలిపెట్టనని.. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళని వదిలిపెట్టాననని.. ఇక పాత మాణిక్యo బయటకు రావల్సిందేనని మాణిక్యం అంటాడు. ఏంటి బెదిరిస్తున్నావ్ అని సందీప్ అంటాడు. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. ఏంటి గొడవ మీ వళ్లే తనకి ఈ సిచువేషన్ వచ్చింది.. ఇక్కడ నుండి వెళ్లిపోండి అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మిని చూసుకునే బాధ్యత నాది అని అందరిని వెళ్లిపోమంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.