English | Telugu
Karthika Deepam2 : సుమిత్ర ఆచూకీ తెలుసుకున్న శివన్నారాయణ.. టెన్షన్ లో కార్తీక్!
Updated : Oct 25, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -497 లో.... కార్తీక్ దగ్గరికి శివన్నారాయణ వస్తాడు. తను సుమిత్రని చూడకుండా దీప కర్టైన్ వేస్తుంది. ఎందుకు కార్తీక్ టెన్షన్ పడుతున్నావ్. సుమిత్ర దొరుకుంతుందా అని శివన్నరాయణ అడుగుతాడు. దొరుకుతుందని కార్తీక్ అనగానే.. ఎలా దొరుకుతుంది మనసు ముక్కలు అయి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది. మనకి దగ్గరున్నా రాలేదని శివన్నారాయణ అంటుంటే కార్తీక్, దీప టెన్షన్ పడుతారు.
నాన్న టిఫిన్ చెయ్యండి అని కాంచన అంటుంది. నేను చేసే వచ్చాను.. మీరు టెన్షన్ పడకండి నేను వచ్చిన పని అయింది.. వెళ్తున్నానని బయల్దేరతాడు. ఆ తర్వాత తాత ఎక్కడ కన్పించడం లేదు.. తాత కూడా ఇంట్లో నుండి వెళ్లిపోయాడా అని జ్యోత్స్న అనగానే ఏం మాట్లాడుతున్నావే అని పారిజాతం కోప్పడుతుంది. అసలు నిన్ను చిన్నప్పుడు మార్చి తప్పు చేసానని పారిజాతం అంటుంటే..ఇప్పుడు సరిదిద్దుకోలేవులే అని జ్యోత్స్న అంటుంది. మళ్ళీ మారుస్తానని అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నీకు అసలైన
వారసురాలు తెలుసా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదు వెతుకుతానని పారిజాతం అంటుంది. అటు పెంచిన తల్లిపై లేదు.. సొంత తమ్ముడికి కష్టం వస్తే పట్టించుకోవు.. ఒకవేళ రేపు నాకు ఏదైనా అయితే ఇలాగే ఉంటావని పారిజాతం కోప్పడుతుంది.
మరొకవైపు ఏంటి తాత మాట్లాడాలన్నావవి కార్తీక్ బయటకు వస్తాడు. నిజంగా సుమిత్ర ఎక్కడ ఉందో తెలియదా అని శివన్నారాయణ అడుగుతాడు లేదని కార్తీక్ అంటాడు. అప్పుడే శౌర్య వస్తుంది. తనకి చాక్లెట్ ఇచ్చి సుమిత్ర అక్కడే ఉన్న విషయం శివన్నారాయణ తెలుసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీపలపై కోప్పడుతాడు. ఇంత నమ్మకద్రోహం చేస్తావా అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.