English | Telugu

Karthika Deepam2 : సుమిత్రని కనిపెట్టేసిన దీప.. దొంగోడు ఎంత పని చేశాడంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -491 లో.... శివన్నారాయణ స్పృహలోకి వచ్చి.. సుమిత్ర ఎక్కడ అని అడుగుతాడు. ఉందట తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పారని శివన్నారాయణతో కాంచన చెప్తుంది. కార్తీక్ నువ్వు వెళ్లి అత్తని తీసుకొని రా అని కాంచన పంపిస్తుంది. మరొకవైపు ఒక దొంగ సుమిత్రని నగలు ఇవ్వమని బెదిరిస్తుంటే దీప వచ్చి రౌడీ తలపై కొడుతుంది. మరోవైపు శివన్నారాయణ, దశరథ్ కి కాంచన భోజనం తినిపిస్తుంది.

ఆ తర్వాత జ్యోత్స్నని పారిజాతం పక్కకి తీసుకొని వచ్చి మాట్లాడుతుంది. నా భర్తపై కోపం ఉంది కానీ ఆయన్ని చంపాలని ఎప్పుడు అనుకోలేదు .. ఆయనకి ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వే.. మీ అమ్మ వెళ్తుంటే ఆపలేదు.. నీలో అసలు బాధ అనేది కనిపించడం లేదని జ్యోత్స్నని పారిజాతం తిడుతుంది. ఎవరు మారినా నేను మారనని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళదాం అమ్మ అని సుమిత్రని దీప రిక్వెస్ట్ చేస్తుంది కానీ దీపతో సుమిత్ర కోపంగా మాట్లాడుతుంది. ఆ రౌడీ మళ్ళీ వచ్చి దీపని కొట్టబోతుంటే సుమిత్ర అడ్డుపడుతుంది. దాంతో దెబ్బ తనకి తగులుతుంది.

మరొకవైపు కార్తీక్ కి దీప ఫోన్ చేసి అర్జెంట్ గా ఇంటికి రా అంటుంది. కార్తీక్ ఇంటికి వెళ్లి నేను అత్త గురించి వెతుకుతుంటే ఎందుకు పిలిచావని దీపని కార్తీక్ అడుగుతాడు. అప్పుడే శౌర్యా వచ్చి అమ్మమ్మ అని చెప్పబోతుంటే ఎందుకు అత్త గురించి శౌర్యకి చెప్పావని కార్తీక్ అంటాడు. శౌర్య గది వంక చూపించగానే కార్తీక్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ సుమిత్ర పడుకొని ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.