English | Telugu

Karthika Deepam2 : కన్పించకుండాపోయిన సుమిత్ర.. కార్తీక్, శివన్నారాయణ కనిపెడతారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -489 లో..... అనసూయ శౌర్య కోసం ఒక బొమ్మ తీసుకొని వస్తుంది. ఇది బొమ్మ కాదు కోరిక అని దీపతో అంటుంది. నా మనవరాలు అని చెప్పుకోవడానికి నీకు కార్తీక్ కి పుట్టిన బిడ్డ ఉండాలి. శౌర్యకి ఆడుకోవడానికి ఒక చెల్లి కావాలని అనసూయ అనగానే దీప షాక్ అవుతుంది. శౌర్యకి మీరు తల్లిదండ్రులు మాత్రమే కాదు భార్య భర్తలు కూడా.. మా అందరి కోరిక తీరుస్తాను అంటేనే ఈ బొమ్మ తీసుకోమని అనసూయ అంటుంది. చాలాసేపు అలోచించిన దీప ఆ బొమ్మని తీసుకుంటుంది.

దాంతో అనసూయ, కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా కార్తీక్ వింటాడు. ఆ తర్వాత దీప బయటకు వస్తుంది. లోపల జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు సిగ్గుపడతారు. ముందు ఇంటికి వెళదాం.. అక్కడ అమ్మ సిచువేషన్ ఎలా ఉందోనని దీప అంటుంది. నువ్వు నేను తాతయ్య కలిసి.. అత్త మామయ్యలని కలపాలని కార్తీక్ అంటాడు. మరొకవైపు కాశీకి జాబ్ వస్తుంది. దాంతో స్వప్న, శ్రీధర్, కావేరి అందరు మెచ్చుకుంటారు. ఇప్పుడు జాబ్ వస్తే గానీ నా గురించి తెలియలేదా అని కాశీ కోపంగా అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప ఇంటికి వెళ్లేసరికి సుమిత్ర లేదని మాట్లాడుకుంటారు. అది విని షాక్ అవుతారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని జ్యోత్స్న అనగానే నోరు ముయ్ అని శివన్నారాయణ, దశరథ్ ఇద్దరు తనపై కోప్పడుతారు. అసలు మీ అమ్మ వెళ్తుంటే ఆపితే ఈ పరిస్థితి వచ్చేది కాదని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.

అంటే సుమిత్ర వెళ్లడం మీరు చూసారా అని దశరథ్ అడుగుతాడు. అంటే నేను చూడలేదని పారిజాతం అంటుంది. ఎవరో వెళ్లినట్టు అనిపించిందని జ్యోత్స్న అన్నదని పారిజాతం చెప్తుంది. ఇంట్లో నుండి ఎవరు వెళ్తారు. ఆ మాత్రం తెలివి లేదా అని అందరు జ్యోత్స్నని తిడతారు. కార్తీక్, దశరథ్ ఇద్దరు సుమిత్రని వెతకడానికి వెళ్తారు. మరొకవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు. అప్పుడే శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త కన్పించడం లేదు.. అక్కడకి వస్తే చెప్పమని చెప్తాడు. అదే విషయం కాంచనతో శ్రీధర్ చెప్పగానే కాంచన షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.