English | Telugu

Karthika Deepam2 : వారసురాలిని చంపాలని చూస్తున్న జ్యోత్స్న.. కార్తీక్ హోటల్ కి శ్రీధర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -298 లో......నువ్వే నా ప్రాణధాత అని చెప్పట్లేదు.. అలాంటప్పుడు నేనేందుకు బయటపడాలి. నీ అంతటా నువ్వే చెప్పేవరకు నేను బయటపడనని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి ఆ దీప ఏదో వచ్చి వాగుతుంటే.. మీ అమ్మ భలే చేసిందని పారిజాతం అంటుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు ఆధారాలు ఎక్కడ నుండి తీసుకొని వస్తుంది. అసలు అంత పెద్ద అబద్ధం ఎలా ఆడాలనిపించిందని పారిజాతం అంటుంది.

దీప చెప్పింది అంత నిజమే.. ఇంట్లో నా స్థానం లాక్కోవాలని చూస్తే ఊరుకుంటానా అని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. ఇంట్లో నీ స్థానం ఏంటి అని పారిజాతం అనగానే.. అయ్యో మళ్ళీ నోరు జారానా అంటూ ఆ ఇంట్లో బావ పక్కన నేను ఉండాలి కదా అని కవర్ చేస్తుంది. ఆ దీప కార్తీక్ ని వదిలిపెట్టదు.. నిన్ను వదిలిపెట్టదని పారిజాతం అంటుంది. దానికి ఆధారాలు దొరకవని జ్యోత్స్న అంటుంది. అవన్నీ ఎందుకు నువ్వు పెళ్లి చేసుకో ఆస్తులన్నీ నీ పేరున రాస్తారని పారిజాతం అంటుంది. దీప ఎక్కడ అసలైన వారసురాలు అని తెలుస్తుందోనని భయంతో.. అలా జరగకూడదని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.

కార్తీక్ కి దీప కొత్త షర్ట్ తీసుకొని వస్తుంది. మీరు ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్.. అలాగే బట్టలు వేసుకోవాలని దీప అంటుంది. శౌర్య వస్తుంది. కార్తీక్ ప్రాణధాత గురించి మాట్లాడతాడు. ప్రాణధాత మీ అమ్మలాగా ఉంటుందని ఎక్కడైనా కన్పిస్తే చెప్పమని కార్తీక్ అంటుంటే దీప తెలిసిపోయిందా అన్నట్లు చూస్తుంది కానీ కార్తీక్ తెలివిగా భయటపడడు. ఆ తర్వాత రెస్టారెంట్ కి శ్రీధర్, కావేరి వస్తారు. శ్రీధర్ ఏదో ఒక రకంగా దీప ని బాధపెట్టే ప్రయత్నం చేస్తాడు. శ్రీధర్, కావేరి భోజనం చేస్తారు. బిల్ హాఫ్ మీ ఒక్కరిదే కట్టండి అని కార్తీక్ అంటాడు. చూసేసరికి పర్సు ఉండదు. అలాగే శ్రీధర్ ఫోన్ మర్చిపోయి వస్తాడు. కావేరి నువ్వు కట్టమని శ్రీధర్ అనగానే.. ఇప్పటివరకు దీపని తిట్టావ్ కదా నీ సంగతి చెప్తానంటూ నా ఫోన్ కూడా మర్చిపోయానని కావేరి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.