Read more!

English | Telugu

Karthika Deepam2 : డ్రింక్ చేసి యాక్సిడెంట్ చేసిన జ్యోత్స్న.. నిజం చెప్పిందని పారిజాతం ఫైర్!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -29 లో....జ్యోత్స్న డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తుంటుంది. పార్టీ లో తన ఫ్రెండ్ గౌతమ్ విసిరిన ఛాలెంజ్ లో ఓడిపోవడంతో... కార్తీక్ కి నువ్వు అంటే ఇష్టం లేదని గౌతమ్ అనడం పదే పదే గుర్తుకుతెచ్చుకుంటుంది.. జ్యోత్స్న ఇంటికి వచ్చాక నడవలేని సిచువేషన్ లో ఉంటే దీప చూసి.. తన గదిలోకి తీసుకొని వెళ్లి పడుకోపెడుతుంది. అదంతా పారిజాతం చూసి జ్యోత్స్న తో ప్రొద్దున మాట్లాడుతానని అనుకుంటుంది.

ఆ తర్వాత అనసూయ హైదరాబాద్ కి వస్తుంది. టీ షాప్ అతనితో గొడవ పెట్టుకుంటుంది. అతన్ని నర్సింహా తెలుసా అని అడుగుతుంది. నాకు తెలియదని అతను చెప్తాడు. మరొక మవైపు నాకూడా రాత్రి ఒక కల వచ్చింది అమ్మగారు.. దీప నన్ను గుర్తుపట్టి నిజం చెప్పునట్టు సుమిత్ర పోలీస్ లకి కాల్ చేసినట్టు వచ్చిందని పారిజాతంతో బంటు అంటాడు. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. వారికోసం వచ్చారనుకోని బంటు, పారిజాతం ఇద్దరు భయపడతారు. కానీ వాళ్ళు వచ్చింది జ్యోత్స్న కోసం.. జ్యోత్స్నని పిలవండి అని పిలవంటి అనగానే వాళ్ళు పిలుస్తారు. మీ అమ్మాయి నైట్ ఆక్సిడెంట్ చేసిందని పోలీసులు అనగానే.. జ్యోత్స్న కి పారిజాతం నిజమేనా అంటూ సైగ చెయ్యగనే నిజమే అని జ్యోత్స్న చెప్తుంది. దాంతో రాత్రి కార్ తీసుకొని వెళ్ళింది ఈ బంటు.. వీడిని అరెస్ట్ చేయండని పారిజాతం అంటుంది.. అప్పుడే దీప వచ్చి.. రాత్రి కార్ తీసుకొని వెళ్ళింది బంటు ఏంటి? జ్యోత్స్న కదా అని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటూ దీపని పోలీసులు అడుగుతారు.. అసలు విషయం తెలియని దీప.. రాత్రి జ్యోత్స్న డ్రింక్ చేసి వస్తే నేనే గదిలో పడుకోపెట్టానని చెప్తుంది..

ఆ తర్వాత జ్యోత్స్న డ్రింక్ చేసి కార్ నడిపి ఆక్సిడెంట్ చేసిందని పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. దీపని ఏమైనా అంటారేమోనని తను బయపడుతుంది. కాంచనకి సుమిత్ర ఫోన్ చేసి.. విషయం చెప్తుంది. దాంతో అదే విషయం కార్తీక్ కి కాంచన చెప్పగానే.. వెంటనే తను బయల్దేరి వెళ్ళిపోతాడు. మరొకవైపు శివనారాయణ, దశరథ్ లు పోలీస్ లని కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేస్తుంటారు.. దీపని పారిజాతం తిడుతుంటే సుమిత్ర అడ్డొస్తుంది. ఆ రోజు నీ ప్రాణాలు కాపాడింది ఇప్పుడు ఈ ఇంటి పరువు తీసిందని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.