English | Telugu

Krishna Mukunda Murari : కృష్ణ కంగారు...ఆ ఒక్క మాటతో గుండె పట్టుకున్న అతను!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -455 లో... ఉదయం జాగింగ్‌కు ముకుందను తీసుకెళ్లి తన మనసులో మాట చెప్పాలిన ఆదర్శ్‌ అనుకుంటాడు. అందుకు ముకుందను పిలవడానికి తన గది దగ్గరకు వెళ్తాడు. ముకుంద ఆదర్శ్‌ని చూసి తలుపు వేసేస్తుంది. ఆదర్శ్ డోర్ కొడతాడు. జిడ్డులా తగులుకున్నావ్ ఏంట్రా బాబు. ఇప్పుడు బయటకు వెళ్తే కచ్చితంగా ప్రపోజ్ చేస్తాడు. అవును అంటే ఒక సమస్య కాదు అంటే ఒక సమస్య. ఎలా తప్పించుకోవాలి అనుకుంటు మీరా డోర్ తీస్తుంది.

డోర్ తీయకపోతే ఇంకా నిద్ర లేవలేదు అనుకున్నా. ఇంకా శారీలో ఉన్నావ్ ఏంటి. ట్రాక్ సూట్ వేసుకొని రా నేను వెయిట్ చేస్తా జాగింగ్‌కుముకుంద అలాగే అని కాలు బెనికినట్లు నటిస్తుంది. అదర్శ్ ముకుందకు నిజంగానే కాలు బెనికిందేమో అని తెగ టెన్షన్‌ పడిపోతాడు. బామ్ రాస్తున్న అని కాలు పట్టుకోబోతే ముకుంద కాలు వెనక్కి తీసుకుంటుంది. కాలు పట్టుకోవడం ఇంట్లో ఎవరైనా చూస్తే బాగోదు అని ఆదర్శ్‌తో చెప్తుంది. ఇక తాను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది. ఆదర్శ్‌ హెల్ప్ చేస్తాను అంటే ముకుంద వద్దు అనేస్తుంది. ఇక ఆదర్శ్‌కి తానేం చెప్పాలి అనుకుంటున్నాడో చెప్పమని అంటే ఆదర్శ్‌ తర్వాత చెప్తా అంటాడు. ఈసారికి కూడా తప్పించుకున్నాను అని ముకుంద అనుకుంటుంది. వెళ్దామని ఆదర్శ్ అంటాడు.

మరోవైపు కృష్ణ ఒక్కతే తనలో తానే ఆలోచిస్తుంటుంది. ఈయన కచ్చితంగా ఏదో విషయంలో బాధ పడుతున్నారు. ఎందుకో నాతో చెప్పుకోలేకపోతున్నారు. పరిమళ మేడంకి తెలిసే ఉంటుంది. ఆవిడనే అడిగి తెలుసుకుంటానని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే పడుకున్న మురారి లేచి.. నన్ను లేపోచ్చు కదా అని అంటాడు. మీకు బాలేదు అని లేపలేదు. అదే మనిషి బాగానే ఉంటే సరిపోదు మనసు కూడా బాగానే ఉండాలి కదా అని కృష్ణ అంటుంది. కారణం చెప్పాను కదా.. ఎక్కడికో బయల్దేరినట్లు ఉన్నావని మురారి‌ అడుగుతాడు. గుడికి వెళ్తున్నానని మురారీతో అబద్ధం చెబుతుంది. అప్పుడే మీరా వచ్చి..‌నేను కూడా రావొచ్చా అని అంటుంది. ఎవరికీ తెలీకుండా వెళ్దాం అంటే ఈవిడ బయల్దేరింది ఏంటి. సారీ మీరా నేను ఒక్కదాన్నే వెళ్లాలి ఎందుకంటే దేవుడితో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలని కృష్ణ అంటుంది. ఇక ఇద్దరికి ఏదో ఒకటి చెప్పి కృష్ణ హాస్పిటల్ కి వెళ్తుంటుంది.‌

మరోవైపు సంగీతకి మురారి లైన్ వేస్తుంటాడు. తనకి ఆదర్శ్ తో పెళ్లి జరిగేలా చేయమని సంగీత అనగానే ఒక్కసారిగా మధు గుండె పట్టుకుంటాడు‌ . ఇక సంగీత తనకు ఆదర్శ్‌ అంటే ఇష్టం లేదు కానీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక మధు అమ్మ చెప్పింది అని ఆస్తి కోసం పెళ్లి చేసుకోవద్దని చెప్తే ఇంతలో రజిని వచ్చి మధు చెంప పగలగొడుతుంది. మధుతో సవాలు చేస్తుంది. మధు పెళ్లి జరగకుండా చేస్తాను అని అంటాడు. ఇక కృష్ణకు వేరే డాక్టర్ పరిమళ యూఎస్ వెళ్లిపోయిందని చెప్తాడు. దీంతో కృష్ణ కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.