Read more!

English | Telugu

Karthika Deepam2 : దీప నా కూతురు.. అమ్మ ఆ బూచోడు మళ్లీ రాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం-2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-27 లో.. దీపని వెతుక్కుంటూ తన భర్త నరసింహా ఇంటికి వస్తాడు.  రావే వెళ్దామంటూ దీపని ఇష్టమొచ్చినట్టు నరసింహా అంటుంటే.. సుమిత్ర వస్తుంది. దీప ఎక్కడికి రాదు.. ఇంకోసారి తనతో మాట్లాడాలని గానీ భయపెట్టాలని గానీ చూస్తే ఊచలు లెక్కిస్తానంటూ నరసింహాకి మాస్ వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. మీరు భయపెడితే భయపడాతానా? అయినా తను మీకేమవుతుందని సుమిత్రని నరసింహా అడుగగా.. తను నా కూతురు.. నా కూతురు పుట్టినరోజునే తను పుట్టింది. తను నా పెద్ద కూతురు అనగానే దీప ఎమోషనల్ అవుతుంది.

ఆ తర్వాత నరసింహాని సుమిత్ర తిట్టేసి పంపించేస్తుంది. ఇక వాళ్లూ మాట్లాడుకునేది మేడమీద నుండి బంటు చాటుగా చూస్తాడు. అదే విషయాన్ని పారిజాతానికి చెప్పగా‌.. వాడి పేరేంటి? దీపకి ఏమవుతాడని బంటుని పారిజాతం అడుగగా.. తెలియదని బంటు అంటాడు. ముందు వాడెవడో? దీపకి ఏమవుతాడో? ఎక్కడుంటాడో కనుక్కో వాడు మనకి చాలా అవసరమని బంటుని పారిజాతం పంపిస్తుంది. మరోవైపు సుమిత్ర, దీప మాట్లాడుకుంటారు. నీ భర్త గురించి అడిగితే చెప్పలేదు.. వాడిని చూసాక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు అర్థమవుతుంది. ‌ఇక్కడే మాతోనే ఉండు.. నువ్వు నన్ను అమ్మ అనుకోకపోయిన నేను నిన్ను కూతురు అనుకుంటున్నానని దీపతో సుమిత్ర అనగానే.. లేదు అమ్మ నేను మా ఊరికి వెళ్తాను. అక్కడ మా అత్తయ్య ఉందని చెప్తుంది. నువ్వు ఇలా సింపుల్ గా చెప్తే వినవు.. గట్టిగా చెప్పాల్సిందే.‌. ఇక్కడికి వాడొస్తే మేమందరం ఉన్నాం కానీ నువ్వు బయటకెళ్తే వాడు శౌర్యని తీసుకెళ్తే ఏం చేస్తావని సుమిత్ర గట్టిగా నిలదీస్తుంది‌. ఇక అప్పుడే శౌర్య డోర్ తీసి..  అమ్మ బూచోడు వెళ్ళిపోయాడా? ఇక రాడా అని అడుగుతుంది. హా వెళ్లిపోయాడు ఇక రాడని సుమిత్ర అనగానే.. వారి దగ్గరికి శౌర్య వెళ్తుంది. అమ్మ బూచోడు నిన్ను కోప్పడ్డాడా? ఇక రాడా? మనం వెళ్తున్నామా అని శౌర్య అనగానే.. ఇక రాడు.. మీరు ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడే ఉంటున్నారని చెప్పి శౌర్యని సమిత్ర తీసుకెళ్తుంది.

మరోవైపు నరసింహాని తన మరో భార్య తిట్టి.. గదిలోకి వస్తే కాళ్ళు విరగగ్గొడతానని హాల్లోనే పడుకోమని చెప్పి గదిలోకి వెళ్తుంది దాంతో దీప మరింత కోపంతో రగిలిపోతుంటాడు నరసింహా. మరోవైపు జ్యోత్స్న బర్త్ డే పార్టీకి కార్తీక్ ని పిలుస్తుంది. కానీ కార్తీక్ ఏం సమాధానం చెప్పడు. నేను అత్తయ్యని అడుగుతానని జ్యోత్స్న అనగానే.. లేదు వస్తాను కానీ ఒక కండిషన్‌‌ ఉందని కార్తిక్ అంటాడు. ఏంటని జ్యోత్స్న అనగా.. మీటింగ్ ఉంది వాళ్ళు వస్తే పార్టీ మధ్యలోనే వస్తానని కార్తీక్ అనగానే సరేనంటుంది జ్యోత్స్న. ఇక దీప దగ్గరికి పారిజాతం వచ్చి.. ఏంటి దీప ఊరికి పోలేదా? ఈపాటికి నువ్వు బస్సు ఎక్కి ఉంటావనుకున్నానే అని పారిజాతం అనగానే.. అలా ఏది పడితే అది అనుకోకండి అత్తయ్య అని సుమిత్ర అంటుంది‌. గొడవ ఏదో జరిగిందంట.. వచ్చినోడు దీప కోసమే వచ్చాడంట అని పారిజాతం అనగా.. అంట అంట అని  గుళ్ళో గంటలాగా అనకండి అత్తయ్య అని సుమిత్ర అంటుంది. ఇదంతా ఆ బంటుగాడు చెప్పాడా? కొందరికి కొట్టిన బుద్ధి రాదు.. తిట్టినా బుద్ధి రాదు. వాడో మూడో రకం అని సుమిత్ర అనగానే.. అదేంటో అని పారిజాతం అంటుంది. ఛీ అన్నా.. ఛీఛీ అన్నా.. సిగ్గులేనిరకం. వాళ్లు ఎలా ఉంటారో తెలియాలంటే నా గదిలో అద్దం ఉంటుంది. అందులో వెళ్ళి చూసుకోమని శివనారాయాణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.