English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎటో వెళ్ళిపోయింది మనసు.. అభి దొరికేసాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -80 లో.. సీతాకాంత్, రామలక్ష్మి మాట్లాడుకుంటారు. మీ అమ్మగారికి ఎక్కడ తెలుస్తుందో, మీరు అక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది సర్.. పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలంటే నేను ఈ ఇంట్లో నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంతగా మంచిది సర్ అని సీతాకాంత్ తో రామలక్ష్మి అంటుంది. నిజమే.. వెళ్ళడం తప్పనిసరి అయినప్పుడు త్వరగా వెళ్ళిపోతేనే ఎవరికి ఏ బాధా ఉండదని సీతాకాంత్ అంటాడు.

అభి ప్రవర్తన కాస్త విచిత్రంగా ఉందని, ఇంటికి ఆఫీస్ కు రావొద్దని చెప్పిన వస్తున్నాడు. వాళ్ళ అమ్మగారికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయించాలని ఆఫీస్ కి వచ్చి డబ్బులు తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎలా ఉంది ఏంటని ఒక్కసారి కూడా కాల్ చేసి చెప్పలేదు. పదే పదే ఫోన్ చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయడం లేదని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్తాడు. దాంతో తనముందు కాల్ చేయమని సీతాకాంత్ తో రామలక్ష్మి అనగానే.. అతను అభికి కాల్ చేస్తాడు. కానీ లిఫ్ట్ చేయడు. ఇక అభి వాళ్ళింటికి ఇద్దరు బయల్దేరి వెళ్తారు. అయితే రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు మాట్లాడుకున్నదంతా చాటుగా వింటుంది శ్రీలత. ఇక అదే విషయం చెప్పడానికి సందీప్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడు. ఇక వాళ్ళిద్దరిని ఎక్కడికి వెళ్తున్నారంటు కాసేపు ఆపే ప్రయత్నం చేస్తుంది శ్రీలత. సీతాకాంత్ , రామలక్ష్మి ఇద్దరు వెళ్లగానే ఇంటికి సందీప్ వస్తాడు. వాళ్ళిద్దరు అభి గాడి ఇంటికి వెళ్తున్నారు.. తొందరగా వెళ్ళి ఫాలో అవ్వు.. మిస్ చేయకని సందీప్ తో శ్రీలత చెప్పి పంపిస్తుంది. మరోవైపు అభి తన ఫ్రెండ్ తో కలిసి తాగుతు మధ్యలో ఆమ్లెట్ కోసం వాళ్ళ అమ్మని విసిగిస్తాడు.

ఇక రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు కార్ లో వాళ్ళింటి ముందు దిగడం కిటికీలో నుండి అభి చూస్తాడు. ఇక వెంటనే వాళ్ళ అమ్మని గదిలోకి వెళ్ళమని తను చెప్పావరకు బయటకు రావొద్దని చెప్పి తన ఫ్రెండ్ తో కలిసి డోర్ తోసుకొని బయటకు వస్తాడు అభి. ఇక సీతాకాంత్, రామలక్ష్మిని చూసి కంగారుపడతాడు అభి. తను అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలని అభి చెప్పగా.. ఒక్క పది నిమిషాలు మాట్లాడాలని సీతాకాంత్ చెప్తాడు. సరేనని ముగ్గురు ఒక చోటుకి మాట్లాడటానికి వెళ్తారు. " నీ మాటలు ఒకరంగా ఉన్నాయి.. నీ ప్రవర్తన మరోరకంగా ఉంది. నిన్ను చూస్తే డౌట్ వస్తుంది" అని అభితో సీతాకాంత్ అనగానే.. అభి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.