English | Telugu
Karthika Deepam2 : కాశీ, దాస్ లని చూసి కార్తీక్ షాక్.. శౌర్యకి ఏదో ఉందని దీపకి డౌట్!
Updated : Aug 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -137 లో....కాశీ , దాస్ వస్తున్నారని పారిజాతం హడావిడి చేస్తుంది. మనవడు వస్తున్నాడని పిన్ని హడావిడి అని దశరత్ అనగానే.. వాడికీ రాఖి కట్టడం ఇష్టం లేదు.. బావ కోసం మాత్రమే కడుతున్నానని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత దాస్ కాశీ ఇంటికి రాగానే పారిజాతం వెళ్లి ఇద్దరినీ ప్రేమగా పలకరిస్తుంది. ఎలా ఉన్నావంటూ కాశీతో మాట్లాడుతుంది. ఇంట్లో అందరిని పారిజాతం పరిచయం చేస్తుంది. జ్యోత్స్న అక్క అవుతుందని దాస్ అనగానే.. జ్యోత్స్న చిరాకుగా చూస్తుంది. అప్పుడే కాంచనని తీసుకొని కార్తీక్ వస్తాడు. కాశీ, దాస్ లు అక్కడ ఉండడం చూసి.. ఏంటి ఇక్కడున్నారని కార్తీక్ అడుగుతాడు.
ఆ తర్వాత పారిజాతం కొడుకు, మనవడు అని తెలుసుకొని కార్తీక్ షాక్ అవుతాడు. వాళ్ళని కూడా పారిజాతం కాశీకి పరిచయం చేస్తుంది. స్వప్న మాటలు గుర్తు చేసుకొని.. వీళ్ళ పెళ్లి జరగాలంటే పేరెంట్స్ కావాలి అంటారు. అప్పుడు నాన్న గురించి నిజం బయటపడుతుందని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ వచ్చి వచ్చిన పని చూసుకొని వెళ్ళండి అని కోప్పడతాడు. కాశీకి జ్యోత్స్న రాఖీ కడుతుంటే.. తన చేతికి ఆల్రెడీ ఒక రాఖీ ఉంటుంది. అది చూసి ఎవరు కట్టారని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పుడే దీపక్క కట్టింది.. నా ప్రాణం కాపాడింది కదా.. నేనే కట్టమన్నానని కాశీ అనగానే.. అలాంటప్పుడు నన్నెందుకు కట్టమన్నావ్ .. అది తీసేయమని జ్యోత్స్న అనగానే అందరు తనపై కోప్పడుతారు. ఇక ఏం చెయ్యలేక జ్యోత్స్న రాఖీ కడుతుంది. కాంచన దశరత్ కీ రాఖి కడుతుంది. జ్యోత్స్నకి కాశీ డబ్బులు ఇస్తుంటే.. నాకు ఇచ్చే రేంజ్ నీది కాదు.. ఆ దీపకి ఇవ్వు అంటూ పొగరుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత దాస్ కి కాంచన రాఖీ కడుతుంది. దాంతో పారిజాతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు కార్తీక్ బాబు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళను చూసి ఉంటారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని దీప అనుకుంటుంది. అప్పుడే అనసూయ వచ్చి.. ఇదిగో ఇల్లు నీ పేరున రిజిస్ట్రేషన్ అయిందని పేపర్స్ ఇస్తుంది. ఇదిగో డబ్బులు.. నీ దగ్గర అప్పట్లో తీసుకున్నాను.. నా పేరున పోస్టాఫీసు చేసినా.. ఇప్పుడు తీసుకున్నాను.. శౌర్యకి పనికి వస్తాయంటు.. శౌర్యకి ఏదో ఉందన్నట్లు అనసూయ మాట్లాడేసరికి దీపకి డౌట్ వస్తుంది. మళ్ళీ అనసూయ దాన్ని కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కార్తీక్ మంచితనం గురించి మాట్లాడుకుంటారు. మరొకవైపు స్వప్నకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు శ్రీధర్. ఆ విషయం తెలిసి స్వప్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.