English | Telugu

అనసూయకి నిజం చెప్పేసిన  కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -135 లో.... శౌర్య కోసం టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది అనసూయ. ఈ టాబ్లెట్స్ చిన్న పిల్లల గుండె సమస్యలు ఉంటే వాడుతారని చెప్పారు. శౌర్యకి ఏం సమస్య ఉందని ఆలోచిస్తూ అనసూయ వస్తుంటే.. అప్పుడే నర్సింహా ఎదరుపడతాడు. నీ కోసమే వస్తున్నాను.. నువ్వే వస్తున్నావని నర్సింహా అంటాడు. మనం ఊరు వెళ్లి, ఇల్లు అమ్మాలి నీకు రెండు లక్షలు ఇస్తాను. మిగతా డబ్బులు ఆ శోభ మోహన కొడతానని నర్సింహా అనగానే.. అది దీప ఇల్లు దానికే హక్కు ఉంటుంది. దాని జోలికి రాకని నర్సింహాకీ అనసూయ వార్నింగ్ ఇస్తుంది.

అప్పుడే కార్తీక్ వచ్చి‌.మ నీకు సిగ్గు అనేదే లేదా అంటూ కోప్పడతాడు. మా మధ్య నువ్వేంటి అంటూ నర్సింహా అంటాడు. మీరు ఎవర్ని చూసుకొని ఇలా చేస్తున్నారో అర్థం అయింది. ఇల్లు ఎలా నా సొంతం చేసుకుంటానో చూడు అంటూ నరసింహా వెళ్ళిపోతాడు. ఈ టాబ్లెట్స్ తీసుకోవడానికి వెళ్ళారా అని కార్తీక్ అడుగుతాడు. ఈ టాబ్లెట్ ఎందుకు వాడుతారు బాబు నిజం చెప్పండి అని అనసూయ అడుగుతుంది. నరసింహకు భయపడి శౌర్య కళ్ళు తిరిగి పడిపోతే.. హాస్పిటల్ లో డాక్టర్ శౌర్య గుండె వీక్ ఉందని చెప్పారని అనగానే అనసూయ షాక్ అవుతుంది. దీనికి పరిష్కారం మందులు వాడడమేనని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్వప్న, కాశీలు స్కూటీ పై సరదాగా వెళ్తుంటారు. మన విషయం మీ ఇంట్లో తెలిసింది కదా అని కాశీ అంటాడు. మా అమ్మకి తెలిసిందని స్వప్న అంటుంది. ఇక ఎప్పుడో మీ నాన్నకి కూడా తెలుస్తుందని కాశీ అంటాడు. అప్పుడే స్వప్న, కాశీలని శ్రీధర్ చూస్తాడు.

ఆ తర్వాత అనసూయని తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తాడు. మీరు ఈ విషయం దీపకి చెప్పకండి.. శౌర్యని చూసుకునే బ్రతుకుతుందని కార్తీక్ అంటాడు. మీకు దీప ఏమవుతుందని ఇంత అభిమానం చూపిస్తున్నారని అనసూయ అడుగుతుంది. నాకు శౌర్యని చూస్తే ఏదో తెలియని హ్యాపీ.. తన కోసమే ఇదంతా.. తనకి ఎప్పుడు తోడుగా ఉంటానని కార్తీక్ అంటాడు. ఈ విషయం దీపకి చెప్పకండి అని కార్తీక్ అనగానే.. అప్పుడే దీప వచ్చి ఏ విషయమని అడుగుతుంది. దార్లో నరసింహ కలిసాడు.. ఇల్లు కావాలట అని చెప్తుంది. మీరు రేపు ఊరు వెళ్లి.. వెంటనే ఆ ఇల్లు దీప పేరున చెయ్యండి అని కార్తీక్ అనగానే.. అనసూయ సరే అంటుంది. ఆ తర్వాత శౌర్యతో కార్తీక్ సరదాగా మాట్లాడతాడు. అదంతా పై నుండి జ్యోత్స్న చూస్తుంటుంది.. సుమిత్ర దగ్గరికి కార్తీక్ వస్తాడు. మంచి సలహా ఇచ్చావ్ దీపకీ అని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి ఇండైరెక్ట్ గా దీప గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత రేపు త్వరగా రండి అని సుమిత్ర కార్తీక్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.