English | Telugu
Karthika Deepam2 : డాక్టర్ బాబు అనుకుంటున్నావా.. నీ లైఫ్ లో బేబీ ఉందా!
Updated : Aug 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -133 లో..... దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. చాలా కంగ్రాట్స్ దీప అని జ్యోత్స్న అనగానే ఎందుకని దీప అడుగుతుంది. నేను ఎంతో ఇష్టపడిన వాళ్ళతో నన్ను తిట్టిస్తున్నావని జ్యోత్స్న అంటుంది. కష్టంలో ఉన్నవాళ్లు అందరు నీకే ఎదరవుతారు అదేంటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నావ్ కదా.. అసలు ఆ వీడియో నువ్వే కావాలని తీయించావ్ .. ఎంతిచ్చావని జ్యోత్స్న అనగానే నువ్వు ఏదో మైండ్ లో పెట్టుకొని ఇలా చేస్తున్నావ్.. ఇలా ఆలోచిస్తే నువ్వు ఇష్టపడేవాళ్ళు దూరం అవుతారని దీప అంటుంది.
మరొకవైపు స్వప్న ఫోన్ లో స్వప్న-కాశీ ఉన్న ఫోటోని కావేరి చూస్తుంది. అప్పుడే స్వప్న వచ్చి.. ఏంటి అని అడుగుతుంది. ఇదేంటి ఎవరైనా ప్రేమిస్తున్నావా అని అడిగితే.. లేదన్నావ్ ఇదేంటని స్వప్నపై కావేరి కోప్పడుతుంది. తన చెంప చెల్లుమనిపిస్తుంది. డాడ్ కీ చెప్తానని కావేరి అనగానే వద్దని స్వప్న రిక్వెస్ట్ చేస్తుంది. స్వప్న వాళ్ళ ప్రేమ గురించి మొత్తం చెప్తుంది దీప. అతన్ని సేవ్ చేసిందని చెప్తుంది.. అతని గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి.. నా జీవితం లాగా నా కూతురు జీవితం కాకూడదని కావేరి ఆలోచిస్తుంది. మరొకవైపు శౌర్య టాబ్లెట్స్ వేసుకున్నానని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ బాబు చాలా బిజీ ఉంటాడు.. నువ్వు అలా డిస్టబ్ చెయ్యకూడదు.. అయిన ఆ బాబుని అనాలి నీ వయసు ఎక్కడ? ఆయన వయసు ఎక్కడ? అయన ఏమైనా డాక్టర్ బాబు అనుకుంటున్నావా .. కార్తీక్ బాబు అని దీప అంటుంది. ఆ మాటలన్నీ కార్తీక్ విని నవ్వుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ దీపకి ఫోన్ చేసి.. శౌర్య నా ఫ్రెండ్ నన్ను డిస్టబ్ చెయ్యడమంటూ ఏముండదని మాట్లాడతాడు.ఆ తర్వాత కార్తీక్ బీరువా దగ్గరికి వెళ్లి అందులో నుండి ఒక చైన్ తీసి.. ఎక్కడున్నావ్ నన్ను చిన్నప్పుడు కాపాడావని నీ సాయం మర్చిపోలేను.. నీకు సాయం చెయ్యాలనుకుంటానని కార్తీక్ అనుకుంటాడు. ఆ చైన్ దీప ది చిన్నప్పుడు కార్తీక్ ని కాపాడేటప్పుడు ఆ చైన్ అనుకోకుండా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది.
మరుసటి రోజు ఉదయం కార్తీక్ రెస్టారెంట్ గురించి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతాడు. ఇవి కూడా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావంటూ స్వప్న, కాశీల ప్రేమ విషయం గురించి గుర్తుచేసుకుంటాడు. ఇప్పుడు ఇదొక టెన్షన్ అని అనుకుంటాడు. అప్పుడే కాంచన వచ్చి బేబీ అని ఎవరిని అంటారని అడుగుతుంది. లవర్ ని అంటారు.. ఈ మధ్య భార్య కూడా అంటుంది.. అలా అని చెప్తాడు.. మీ నాన్న ఫోన్ కి ఒకావిడ ఫోన్ చేసి బేబీ అంటుంది అనగానే కావేరి అయి ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు.. నీకు నాన్నపై డౌట్ ఉందా అని కార్తీక్ అడుగగా.. లేదని కాంచన అంటుంది. అప్పుడే కాంచన చైన్ చూపించి.. ఇది ఎవరిదిరా జ్యోత్స్న అయితే ఇలాంటివి వెయ్యదు.. నీ లైఫ్ లో కూడా ఒక బేబీ ఉందా ఏంటని కాంచన అనగానే.. ఉందని కార్తీక్ అంటాడు. పదేళ్లప్పుడు నేను కోనేటిలో పడిపోతే ఒకమ్మాయి సేవ్ చేసిందని తెలుసు కదా.. ఆ అమ్మాయిది.. అప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చిందో కూడా తెలియదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.