English | Telugu
Karthika Deepam2 : స్వప్న ప్రేమ విషయం తెలుసుకున్న కార్తీక్!
Updated : Aug 24, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-131 లో..యాక్సిడెంట్ అయిన కాశీని జ్యోత్స్న వదిలేసి వెళ్లిపోవడం దీప కాపాడటం విషయం కార్తీక్ ఇంట్లో చెప్తాడు. ఇద్దరిలో ప్రాణం విలువ ఎవరికీ తెలుసని అడుగుతాడు. దానికి సుమిత్ర దీపకే తెలుసని అంటుంది. దశరథ్ కూడా కార్తీక్‌ని నువ్వు చెప్పిన మాటలు కరెక్ట్‌ని జ్యోత్స్నకి మానవత్వం గురించి చెప్తాడు. పారిజాతానికి శివనారాయణ తిడతాడు. నువ్వు కూడా పక్కనే ఉన్నావ్ కదా చెప్పలేదా అని అడుగుతాడు. నీకే పద్ధతులు తెలీవని జ్యోత్స్నకి నువ్వేం చెప్తావని తిడతాడు. ఇక కార్తీక్ దీప హాస్పిటల్‌లో ఉందని తాను కూడా వెళ్తానని అంటాడు. సుమిత్ర కూడాఅత్త మీద కోప్పడుతుంది. మీరు పక్కనే ఉంటే దాని పెళ్లి అవుతుందో లేదో అంటుంది. పారిజాతం మనసులో నిన్ను ఇలా తయారు చేసి తప్పు చేశానే నిన్ను ఎలా మార్చాలా అని ఆలోచిస్తుంది.
హాస్పిటల్లో కాశీకి స్ఫృహ వస్తుంది. నర్సు దీపకి విషయం చెప్తుంది. దీప వెళ్తుంటే స్వప్న కూడా వస్తుంది. స్వప్న కాశీని చూడ్డానికి వెళ్తానంటే దీప ఆపి నీకు అతను ఎలా తెలుసని అతని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. దానికి స్వప్న తాను కాశీ ప్రేమించుకున్నామని చెప్తుంది. కాశీ నా కోసమే వైజాగ్ నుండి హైదరాబాద్ కి వచ్చాడని స్వప్న ఏడుస్తూ చెప్పగా.. మరి మీ విషయం ఇంట్లో తెలుసా అని దీప అడుగుతుంది. తెలీదు కానీ నేను ఎవరి కోసం కాశీని వదులుకోను. కాశీ. కాశీ అని స్వప్న కాశీ దగ్గరకు వెళ్లి గట్టిగా ఏడుస్తుంది. ఇక కాసేపటికి హాస్పిటల్ కి కార్తీక్ వస్తాడు. అక్కడ స్వప్న, కాశీ చేతులని పట్టుకోవడం చూసిన కార్తీక్.. నువ్వెంటి ఇక్కడ అని అడుగుతాడు. దీప నీతో ఏం చెప్పలేదా బాస్ అని స్వప్న అనగానే.. మీతో బయట చెప్పాలనుకున్నది ఇదే బాబు గారు అని దీప అంటుంది.
ఈ ప్రేమ విషయం మీ నాన్నకి తెలుసా అని కార్తీక్ అడుగుతాడు. తెలీదు బాస్ కాశీ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. తనకి జాబ్ వచ్చిన తర్వాత మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలి అనుకున్నాం. ఈ రోజు తనకి ఇంటర్వ్యూ ఉంది. నేను దగ్గరుండి ఎదురొచ్చి పంపించా. ఈ రోజు తనకి ఈ యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే జాబ్ వచ్చుండేది. మా మమ్మీడాడీకి కాశీని పరిచయం చేసేదాన్ని అని స్వప్న ఏడుస్తుంటే.. ఏడ్వకు, మొత్తం నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. స్వప్న ఎవరినో లవ్ చేస్తుందని అనుమానంతో ఉన్న కావేరి స్వప్నని పిలుస్తుంది. ఇక పారిజాతం కొడుకు దాస్ హాస్పిటల్‌లోకి వచ్చి.. కాశీ తన కొడుకని చూడ్డానికి వస్తాడు. నర్స్ రెస్ట్ తీసుకుంటున్నాడని తర్వాత రమ్మని చెప్తుంది. ఇక జ్యోత్స్న, పారిజాతం హాస్పిటల్‌కి వస్తారు. పారిజాతం దాసుని చూసి దాసు ఇక్కడున్నాడేంటని అనుకుంటుంది. దాస్ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగగా.. దాసు యాక్సిడెంట్ వీడియో చూపించి కాశీ తన కొడుకని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.