English | Telugu

నేను నథింగ్.. రతికతో లవ్ ట్రాక్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామీలీ వీక్ అంటే జనాలంతా ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే కొన్ని వారాలుగా ఫ్యామిలీకి దూరంగా హౌస్ లో ఉన్నవారికోసం వస్తారు కాబట్టి దానికంత క్రేజ్. కానీ దానికి మించి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు కంటెస్టెంట్స్. ప్రతీ సీజన్ లో లాగా ఈ సీజన్-7 లో టాప్-5 ని కాకుండా టాప్-6 ని ఉంచారు బిగ్ బాస్. ఇక గత మూడు రోజులుగా ఈ ఆరుగురికి సంబంధించిన జర్నీ వీడియోలని బిగ్ బాస్ చూపిస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్ లో‌ మొదటగా యావర్ జర్నీని ప్లే చేసారు‌ బిగ్ బాస్. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'టెంపర్' సినిమాలోని 'నీ అయ్య టెంపర్'.. పాటతో యావర్ కి స్వాగతం పలికాడు బిగ్ బాస్. ఇక గార్డెన్ లో మంచు కురుస్తున్న వేళ.. తన జర్నీని అద్భుతంగా మలిచాడు బిగ్ బాస్. తను గేమ్ లో ఆడిన విధానం, శివాజీ ఓదార్చిన సీన్, బాల్ టాస్క్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పడిన కష్టం.. ఇలా అన్ని ఫోటోలని చూపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత యావర్ కోసం కొన్ని మోటివేషనల్ మాటలని మాట్లాడాడు బిగ్ బాస్. ‘మీరు ఏదైనా ఇష్టపడితే దాని కోసం ఎంత కష్టపడటానికైనా సిద్దపడే మీ గుణం అందరికి నచ్చింది. టాస్క్‌లలో మీకు ఎవరు పోటీ కాదు అనే విధంగా ప్రతి టాస్క్‌లో ఇరగదీశారు. యావర్‌తో పోటీ అంటే ఆలోచించాల్సిందే అనేట్టు చేశారు. స్పైగా మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ ప్రయాణం సాఫీగా ముందుకు కదిలేందుకు దోహదపడింది. మీ కోపం, పట్టుదల.. మీకు తప్పు కనిపించిన ప్రతీ చోట కనిపించాయి. అదే ధైర్యం మీరు ఎవిక్షన్ పాస్‌ని సాధించేలా చేసింది. ఆ ఎవిక్షన్ పాస్‌ని తిరిగి ఇచ్చేసినప్పుడు.. నీతిగా గెలవాలనే మీ క్యారెక్టర్ అందరికీ నచ్చింది" అంటూ బిగ్ బాస్ చెప్పడంతో.. యావర్ ఎమోషనల్ అయ్యాడు.

ఆ తర్వాత యావర్ జర్నీ వీడియోని చూపించాడు‌ బిగ్ బాస్. అందులో రతికతో లవ్ ట్రాక్, శివాజీ, ప్రశాంత్ లతో స్పై గా మొదలైన స్నేహం, శోభాశెట్టితో గొడవ, ఆట సందీప్ బ్యాక్ బిచ్చింగ్, రతిక సీక్రెట్ రూమ్ లో చెప్పిన అన్ డిజర్వింగ్ రీజన్, శివాజీతో కలిసి తనకేమీ లేవని, జాబ్ కూడా లేదని చెప్పుకున్నది.. ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అన్నయ్య వచ్చినప్పటి ఫుటేజ్.. ఇలా అన్నింటిని చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు యావర్. అసలు పరిచయం మనుషుల మధ్య భాష రాకపోయిన.. ఉండొచ్చు అని నిరూపిస్తూ సాగిన యావర్ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఇక తన జర్నీ వీడియో చూసాక యావర్ మాట్లాడిన ప్రతీ మాట యావర్ ని ఈ స్టేజ్ మీద డిజర్వింగ్ అనేంతలా అనిపించింది. బిగ్ బాస్ నేను మీ బిడ్డను.. నేను నథింగ్.. మీరు నన్ను సంథింగ్ చేశారు. నా జీవితాంతం మీకు ఋణపడి ఉంటానని యావర్ చెప్పిన ప్రతీ మాట టీవీ చూస్తున్న ప్రేక్షకుడిని కదిలించాయి. హౌస్ లో ఒంటరిగా మొదలైన యావర్ ప్రయాణం.. బిగ్ బాస్ సీజన్-7 లో ది బెస్ట్ జర్నీగా నిలిచింది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.