English | Telugu
దీప ప్లాన్ తెలిసి బిత్తరపోయిన డాక్టర్ బాబు!
Updated : Feb 20, 2021
`కార్తీక దీపం` రోజుకో మలుపు తిరుగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ శనివారం 968వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్‌లు.. టర్న్‌లు జరగబోతున్నాయి. హిమని డాక్టర్ బాబు తన వద్దకు చేర్చాలని ప్లాన్ వేసిన మోనిత ఈ విషయంపై లాయర్ సుజాతని రంగంలోకి దింపుతుంది. ఇందు కోసం ఆమెకి 2 లక్షలు ఫీజు కింద ఇచ్చేస్తుంది.
అయితే ఇంత జరుగుతున్నా దీప (వంటలక్క) మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుంటుంది. కారణం ఏంటని సౌందర్యతో పాటు మామ ఆనందరావు ఆరాతీస్తే కోర్టు తనకే అనుకూలంగా తీర్పు చెబుతుందని లేదంటే పిల్లకు మీకు ఉన్న సంబంధం ఏంటో నిరూపించుకోండని జడ్జి డాక్టర్ బాబుని అడుగుతారని, అదీ లేదంటే భార్యనీ, పిల్లలనీ ఇంటికి తీసుకెళ్లి బుద్దిగా కాపురం చేసుకోమని హెచ్చరిస్తారని దీప వివరంగా ఎక్స్‌ప్లేయిన్ చేస్తుంది. శుక్రవారం దీప వివరిస్తున్న తీరుని చాటు నుంచి చూసిన డాక్టర్ బాబుకి ఫీజులెగిరిపోతాయి. షాక్‌కు గురైన డాక్టర్ బాబు అక్కడి నుంచి మోనిత ఇంటికి వెళతాడు.
కట్ చేస్తే మోనిత లాయర్ సుజాతకు ఫోన్ చేసి దీప గురించి, కోర్టు కేసు గురించి మాట్లాడుతుంటుంది. అక్కడికి చేరుకున్న డాక్టర్ బాబు వెంటనే మోనిత ఫోన్ లాక్కుని `హాలో నేను కార్తీక్‌ని.. మీరా చెప్పండి.. అంటుంది లాయర్ సుజాత. టెన్షన్ పడకండి. ఆ దీప కేసు గెలిచే ఛాన్సేలేదు` అంటుంది.. అల్రెడీ గెలిచింది. మీరు వాదించడానికి ఏమీ లేదు. మీ కన్నా నాలుగు ఆకుటు ఎక్కువే చదివింది నా పెళ్లాం. ఏం అయ్యింది అని సుజాత అడుగుతుంది. కోర్టుకు వెళ్లకుండానే ఈ కేసు గెలిచేసింది. కోర్టుకు వెళ్లకుండానే కేసు క్లోజ్ అయ్యింది. కేసు వెనక్కి తీసుకుంటున్నాను... సీన్ కట్ చేస్తే తులసి బ్యాగ్ సర్దుకుంటూ ఫోన్ మాట్లాడుతుంటుంది.. ఇంతలో అక్కడికి మోనిత ఎంటరై నేను సాయం చేస్తానుగా అంటుంది. అవసరం లేదు. తోడేలు తోడేస్తానంటే లేడి పిల్లలా నీ వెంటరావడానికి నేనేమీ దీప లాంటి పిల్లని కాదు..తులసిని అంటూ మోనితని ఇరిటేట్ చేస్తుండగానే సీన్‌లోకి దీప ఎంటరవుతుంది.. ఆ తరువాత ఏం జరిగింది? .. మోనిత.. దీపల మధ్య ఎలాంటి చర్చ జరిగింది? అన్నది తెలియాలంటే శనివారం ఎపిసోడ్ చూడాల్సిందే.