English | Telugu
స్టేజ్‌పైనే తన్మయత్వంలో మునిగిన వరుణ్, వితిక!
Updated : Feb 20, 2021
'హ్యాపీ డేస్'` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో వరుణ్ సందేశ్. తొలి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వరుణ్ ఆ తరువాత తనతో కలిసి నటించిన హీరోయిన్ వితికా షేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జోడీ బిగ్‌బాస్ సీజన్ 3లోనూ మెరిసి సందడి చేశారు. తాజాగా వీరిద్దరూ కలిసి టీవీలో షో స్టేజ్‌పై మైమరిచి ఊహల్లో తేలిపోయారు.
జీ తెలుగు ఛానల్ లో సుమ, రవి వ్యాఖ్యాతలుగా 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్'ని మళ్లీ రీ స్టార్ట్ చేశారు. ఈ షోకి గెస్ట్‌లుగా విచ్చేసిన హీరో వరుణ్ సందేష్ , వితిక షేరు స్టేజ్ పై సుమ, యాంకర్ రవి, చుట్టూ ఆడియన్స్ వుండగా "నేను నేనుగా లేనే.. నిన్నమొన్నలా.." అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌కి స్టెప్పులేసి మైమరిచిపోయారు. అక్కడ ఎవరున్నారన్న విషయాన్ని కూడా మరిచిపోయి తన్మయత్వంలో మునిగిపోయారు.
సుమ తన తరహా పంచ్‌లతో నవ్వులు పూయించిన ఈ ఎసిసోడ్ ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్‌లో వితికా షేరు, వరుణ్ సందేశ్ చేసిన హంగామా చూడాలంటే ఆదివారం రాత్రి ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.