English | Telugu
సన్నీ క్యారెక్టర్ గుట్టు విప్పిన డాక్టర్ బాబు
Updated : Jan 7, 2022
బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 5 ముగిసినా కంటెస్టెంట్ల కారణంగా ఇంకా వార్తల్లో వైరల్ అవుతూనే వుంది. తాజాగా `కార్తీకదీపం` ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల బిగ్‌బాస్ సీజన్ 5పై స్పందించాడు. తనదైన స్టైల్లో బిగ్‌బాస్ పై మినీ రివ్యూ ఇచ్చాడు. ఇదే సందర్భంగా ఈ సీజన్ విన్నర్ వీజే సన్నీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ 5లో ఎంట్రీ సాధించిన వీజే సన్నీ, ఉమాదేవి, మానస్, సిరి, విశ్వ, యాంకర్ రవిలతో నిరుపమ్ కు మంచి అనుబంధం వుంది.
ఆ కారణంగానే తను బిగ్‌బాస్ సీజన్ 5ని ఫాలో అయ్యాడట. మొదట్లో విశ్వ విన్నర్ అవుతాడని అనుకున్నానని.. అతనిపై హోప్ వుండేదని, ఆ తరువాత ఆట ముందుకు వెళ్లేకొద్దీ లెక్కలు మారిపోయాయని, మానస్ బ్యాలెన్స్డ్ గా ఆడుతున్నాడనిపించిందని చెప్పుకొచ్చాడు నిరుపమ్. ఇక ఒక స్టేజ్ లో రవి, షణ్ముఖ్ బాగా పుంజుకున్నారని, అయితే సన్నీ విన్నర్ అవుతాడని తాను అసలు ఊహించలేదని మనసులో మాట చెప్పాడు.
Also read:చిరు, ప్రభాస్, రవితేజ.. సేమ్ టు సేమ్!
అరుపులు కేకలతో సన్నీ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడని.. అది అతని రియల్ క్యారెక్టర్ కాదని చెప్పాడు. అయితే ఊహించని విధంగా సెకండ్ హాఫ్ లో అతనిలో వున్న జోవియల్ యాంగిల్ బయటకు వచ్చిందని, అదే అతని రియల్ క్యారెక్టర్ అని అసలు గుట్టు విప్పేశాడు. అదే అతన్ని విజేతని చేసిందని, అయితే మొదట్లో తను ఎందుకంత అగ్రెసివ్‌గా వుంటున్నాడో తనకు అర్థం కాలేదని, ఆ తరువాతే తనలోని జోవియల్ యాంగిల్‌ని సెకండ్ హాఫ్ కోసం దాచేశాడని అనిపించిందని, అది బాగా వర్కవుట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.
ఇంతకీ మీరు బిగ్ బాస్ షోకి వెళతారా అనడిగితే, "నన్నయితే ఇప్పటి వరకు ఎవరూ అడగలేదు. ఒక వేళ అడిగితే ఆలోచిస్తా.. బిగ్‌బాస్ షో నుంచి కాల్ వస్తే నాకున్న కమిట్‌మెంట్స్ ని బట్టి నిర్ణయం తీసుకుంటా. కానీ చేస్తున్న ప్రాజెక్ట్ లని మాత్రం బిగ్‌బాస్ కోసం వదిలేయను. అలా వదిలేస్తే అవి మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది.. అది పద్దతికాదు" అని చెప్పుకొచ్చాడు నిరుపమ్.