Home

»

Latest News

చిరు, ప్ర‌భాస్, ర‌వితేజ.. సేమ్ టు సేమ్!

Jan 7, 2022 3:52PM

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం ఓ విష‌యంలో టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నారు. ఇంత‌కీ అదేమిటంటే.. రైట్ నౌ ఈ ముగ్గురు స్టార్స్ చేతిలోనూ ఐదేసి ప్రాజెక్ట్స్ ఉండ‌డం. ఆ వివ‌రాల్లోకి వెళితే..

ముందుగా చిరంజీవి విష‌యానికి వ‌స్తే.. త‌న తాజా చిత్రం `ఆచార్య‌` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. `గాడ్ ఫాద‌ర్`, `మెగా 154` (బాబీ డైరెక్టోరియ‌ల్), `భోళా శంక‌ర్` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. మ‌రోవైపు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `మెగా 156` సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉంది.

ఇక ప్ర‌భాస్ సంగ‌తే తీసుకుంటే.. ఒక‌వైపు `రాధే శ్యామ్` రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా.. `ఆదిపురుష్` చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుని ఆగ‌స్టు 11న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అలాగే `స‌లార్`, `ప్రాజెక్ట్ కె` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ఇంకోవైపు సందీప్ రెడ్డి కాంబినేష‌న్ లో `స్పిరిట్` త్వ‌రలోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

అలాగే ర‌వితేజ మేట‌ర్ కి వ‌స్తే.. ఒక‌వైపు `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా.. `ధ‌మాకా` షూటింగ్ స్టేజ్ లో ఉంది. సంక్రాంతికి `రావ‌ణాసుర‌` ప‌ట్టాలెక్క‌నుండ‌గా.. అతి త్వ‌ర‌లో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` చిత్రీక‌ర‌ణ‌కు త‌యార‌వుతోంది.

మొత్త‌మ్మీద‌.. చిరు, ప్ర‌భాస్, ర‌వితేజ పంచ‌చిత్ర ప్ర‌ణాళిక‌తో సేమ్ టు సేమ్ అన్న‌ట్లుగా ముందుకు సాగుతున్నార‌న్న‌మాట‌.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com