English | Telugu
నిరుద్యోగులకు వంటలక్క బంపర్ ఆఫర్
Updated : Apr 15, 2022
`కార్తీక దీపం` సీరియల్ తో అటు మలయాళంలోనూ, ఇటు తెలుగులోనూ భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది ప్రేమి విశ్వనాథ్. గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో వంటలక్కగా నిలిచిపోయిన ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలని డైరెక్టర్ ఎండ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు దూరమైంది. గత కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించని, వినిపించని ప్రేమి ఇప్పడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా వంటలక్క హల్‌చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. `కార్తీకదీపం`లో తన పాత్ర ఎండ్ కావడం.. కొత్త జనరేషన్ తో కథ స్టార్ట్ కావడంతో తెలుగు వాతావరణానికి గత కొన్ని రోజులుగా దూరంగా వుంటోంది వంటలక్క. అయితే తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నిరుద్యోగుల కోసం ప్రకటన చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. "నేను కొంత మందిని హైర్ చేసుకుంటున్నాను. నా దగ్గర పనిచేయడానికి ఆసక్తివున్న వారు అప్లై చేసుకోండి" అంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో చాలా రోజుల తరువాత వంటలక్క మళ్లీ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడంతో నెటిజన్స్ వంటలక్క పోస్ట్ పై కామెంట్ లు పెడుతున్నారు.
అన్ని రకాల ఫోర్ వీలర్ (ఆటోమేటిక్, మ్యానువల్ ) వాహనాలు నడుపుటకు డ్రైవర్లు కావలెను. అలాగే అకౌంటెంట్ ఉద్యోగాలకు tally వచ్చిన అభ్యర్థులు కావలెను. ఈ ఉద్యోగానికి రెండు సంవత్సరాల అనుభవం వుండాలి. అయితే ఎంపికైన వారు మాత్రం వంటలక్క సొంత ఊరైన కేరళ కొచ్చిలోని ఎర్నాకులంలో పనిచేయాల్సి ఉంటుందని వంటలక్క చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ వరల్ కావడంతో నెటిజన్ లు కామెంట్లు పెడుతున్నారు. వీ మీడియా ఎంటర్‌టైన్ మెంట్ ని ప్రారంభించిన వంటలక్క దీనిపై నిర్మాత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
ఆమె ఓ ఫిల్మ్ స్టూడియోని కూడా ప్రారంభించింది. ఇందు కోసమే ఉద్యోగాలు ప్రకటించింది. మలయాళంలో `కరుతముత్తు` సీరియల్ లో కెరీర్ ప్రారంభించిన ప్రేమి విశ్వనాథ్ అదే సీరియల్ ఆధారంగా తెలుగులో రూపొందిన `కార్తీకదీపం`తో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ రెండు సీరియల్ లతో ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకుంది.