English | Telugu

నాకూ క్యాస్టింగ్ కౌచ్ సంద‌ర్భం ఎదుర‌య్యింది: 'కార్తీకదీపం' ప్రియ‌మ‌ణి !

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను లైంగికంగా వంచిస్తున్నారని ఇప్పటికే చాలా మంది నటీమణులు బహిరంగంగా కామెంట్స్ చేశారు. 'మీటూ' పేరుతో ఓ ఉద్యమం కూడా చేశారు. తాజాగా ఇదే అంశంపై 'కార్తీకదీపం' సీరియల్ లో పనిమనిషి ప్రియమణి పాత్ర‌ను చేస్తున్న శ్రీ‌దివ్య‌ కొన్ని కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన కెరీర్ సంగతులతో పాటు క్యాస్టింగ్ కౌచ్ విషయాలపై స్పందించింది.

'కమిట్మెంట్' అనేది ఇండస్ట్రీలో ఉంటుందని.. తాను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి అమ్మాయికి ఇలాంటి సందర్భం ఏదొక చోట ఎదురవుతూనే ఉంటుందని.. అయితే అందుకు అంగీకారం తెలపడమా..? లేదా అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని.. ఒక అమ్మాయి బయట పని చేస్తుందంటే కచ్చితంగా ఏదొక సమస్య ఉంటుందని చెప్పింది ప్రియమణి.

అయితే లైంగిక దోపిడీ విషయంలో వార్నింగ్ లాంటివి ఇస్తే ఇక కెరీర్ అక్కడితో ముగిసిపోతుందని ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన విషయంలో క్యాస్టింగ్ కౌచ్ సందర్భాలు ఎదురైనప్పుడు సింపుల్ గా నవ్వుతూ బయటకొచ్చానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె 'పుష్ప' సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. అందులో కూడా పనిమ‌నిషి క్యారెక్టరే అని.. రియల్ లైఫ్ లో పనిమనిషి ఎలా ఉంటుందో అచ్చం అలాగే కనిపిస్తానని చెప్పుకొచ్చింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.