English | Telugu
వంటలక్క ప్రేమిపై నిరుపమ్ ఫేస్‌బుక్ సెటైర్!
Updated : Feb 21, 2021
స్టార్ మాలో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్ `కార్తీక దీపం`. నటుడు, రచయిత పరిటాల ఓంకార్ తనయుడు పరిటాల నిరుపమ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. దీపగా వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్‌తో స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకుని సెలబ్రిటీగా మారిపోయింది.
ఎంతగా అంటే ఈమె ప్రధాన పాత్రలో సినిమా స్టార్ట్ చేసేంత. ప్రేమి విశ్వనాథ్ త్వరలో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇంతలా మహిళా మణుల ఆదరణ చూరగొన్న ప్రేమి విశ్వనాథ్‌పై డాక్టర్ బాబు.. నిరుపమ్ ఫేస్ బుక్ వేదికగా సెటైర్ వేయడం ఆసక్తికరంగా మారింది. శనివారం తన ఫేస్‌బుక్ పేజీలో దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ తీసిన తన ఫొటోని షేర్ చేసి ప్రేమి విశ్వనాథ్ పై సెటైర్ వేయడం వైరల్‌గా మారింది.
వంటలక్క చేసిన వంట ఎలా వుంటుందో ఐడియా లేదు కానీ.. తీసిన ఫొటోలు మాత్రం బానే వుంటాయి. (వందలో ఒకటి రాక చస్తుందా)` అంటూ సెటైర్ వేసి కన్ను కొడుతున్న ఎమోజీని షేర్ చేస్తూ ప్రేమి విశ్వనాథ్‌కు ట్యాగ్ చేశాడు నిరుపమ్. మరి ఈ సెటైర్‌పై వంటలక్క ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.