English | Telugu

ఇంకొక‌రితో డేట్‌కి వెళ్తే నా బాయ్‌ఫ్రెండ్ ఫీల‌వుతాడు!

అందాల యాంక‌ర్‌, బుల్లితెర బుట్ట‌బొమ్మ శ్రీ‌ముఖికి బాయ్ ప్రెండ్ వున్నాడంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అలాంటి వార్త‌లు పుట్టుకొచ్చిన ప్ర‌తీసారి వాటిని లైట్‌గా తీసుకుంటూ కొట్టి పారేస్టూ వ‌స్తోందామె. ఇటీవ‌ల కూడా శ్రీ‌ముఖి ప్రేమ‌లో వుంద‌ని, గ‌త కొంత కాలంగా డేటింగ్ చేస్తోందంటూ వార్త‌లు షికారు చేశాయి.

అయితే తాజాగా మాత్రం త‌ను ప్రేమ‌లో వున్నాన‌ని, త‌న‌కూ ఓ ల‌వ‌రున్నాడ‌ని చెప్పేసి శ్రీ‌ముఖి షాకిచ్చింది. సుమ క‌న‌కాల యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న 'స్టార్ట్ మ్యూజిక్'‌ షోలో ప్ర‌త్యేకంగా పాల్గొన్న శ్రీ‌ముఖి త‌న ల‌వ్ గురించి ఓపెన్ అయిపోయింది. షోలో భాగంగా ఇక్క‌‌డ క‌నిపిస్తున్న వారిలో ఏ హీరో అంటే ఇష్ట‌మంటూ త‌న‌ని ఇరికించే ప్ర‌య‌త్నం చేసింది సుమ‌. అయితే శ్రీ‌ముఖి తెలివిగా త‌న‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్ట‌మ‌ని ట‌క్కున చెప్పేసింది.

ఒక వేళ రొమాంటిక్ డేట్‌కి వెళ్లాల్సి వ‌స్తే ఎవ‌రితో డేట్‌కి వెళ‌తావ‌ని సుమ అడిగితే తాను ఎవ‌రితోనూ డేట్‌కి వెళ్ల‌న‌ని, అల్రెడీ క‌మిటెడ్ అని, నేను డేట్‌కి వెళితే నా బాయ్ ఫ్రెండ్ ఫీల‌వుతాడు, నా కంటూ కొన్ని నియ‌మాలున్నాయ‌‌ని షాకిచ్చింది. దీంతో సుమ‌తో పాటు అక్క‌డున్న విష్ణుప్రియ‌, రోల్ రైడా, హ‌రి, పండు, ఆర్జే చైతూ షాక్‌తో నోరెళ్ల‌బెట్టారు. ఇంత‌కీ ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవ‌ర‌నేది మాత్రం శ్రీ‌ముఖి వెల్ల‌డించ‌లేదు. అత‌ను ఎవ‌ర‌బ్బా..!