English | Telugu
ముమైత్ ముద్దులు తట్టుకోలేకపోయిన అవినాష్!
Updated : Feb 22, 2021
"ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చిటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే.." అంటూ టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది ముమైత్‌ఖాన్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న ముమైత్ తాజాగా ఓంకార్ నిర్వహిస్తున్న డ్యాన్స్ షో `డ్యాన్స్ ప్లస్`లో న్యాయ నిర్ణేతగా ప్రత్యక్షమైంది. గత కొన్ని వారాలుగా ఈ షో విజయవంతంగా ప్రసారమౌతోంది.
శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్సర్స్ తమ పెర్ఫార్మెన్స్‌తో అబ్బురపరుస్తున్నారు. ఇదిలా వుంటే ఈ షోకు మరింత ప్రత్యేకతని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించడానికి ఓంకార్ కమెడియన్ ముక్కు అవినాష్‌ని రంగంలోకి దింపేశాడు. టూ వీక్స్‌కి ఒకసారి ఏదో ఒక గెటప్‌తో అవినాష్ `డ్యాన్స్ ప్లస్` స్టేజ్‌పై తనదైన స్టైల్లో ఎంటర్‌టైన్‌చేస్తూ నవ్వులు కురిపిస్తున్నాడు.
గత వారం పోస్ట్‌మన్‌గా ఎంట్రీ ఇచ్చిన నవ్వుల వర్షం కురిపించి ముమైత్‌తో ఆడుకుంటే ఈ సారి ముమైత్ .. అవినాష్‌తో ఆడుకోబోతోంది. వయసు మళ్లిన వ్యక్తిగా.. పండు ముసలి గెటప్‌లో అవినాష్ స్టేజ్‌పై కొచ్చాడు. ముమైత్ నుంచి ఓ ముద్దు కావాలంటూ సైగ చేశాడు. ముమైత్ దొరికిందే అవకాశం అనుకుని అవినాష్‌ని ముద్దుల్లో ముంచెత్తింది.. ఎంతలా అంటే ఊపిరాడక అవినాష్ ఫ్లోర్‌పై పడి దొర్లేంత!.. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.