English | Telugu

ముమైత్‌కు ఓంకార్ వార్నింగ్‌!

ముమైత్‌ఖాన్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. క్రేజ్ త‌గ్గిపోవ‌డం ఓ కార‌ణం కాగా... అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు లేక‌పోవ‌డం మ‌రో కార‌ణం.. ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా ఆమె సినిమాల్లో న‌టించ‌ట్లేదు. బాల‌కృష్ణ మూవీ‌ 'డిక్టేట‌ర్‌' త‌రువాత ముమైత్ చాలా వ‌ర‌కు సినిమాల్లో క‌నిపించ‌డం మానేసింది.

అయితే తాజాగా ఓంకార్ మ‌ళ్లీ మొద‌లుపెట్టిన `డ్యాన్స్ ప్ల‌స్‌` షోలో న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ముమైత్‌తో పాటు య‌ష్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, బాబా భాస్క‌ర్‌, యానీ మాస్ట‌ర్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ కూడా న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అద్భుత‌మైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఈ షో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ప్ర‌తి శని, ఆదివారాలు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోకి రేటింగ్ బాగానే వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ వారానికి సంబంధించిన ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ముమైత్ ఖాన్ ... స‌హ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యానీ మాస్టర్‌ని మైండ్ గేమ్ ఆడుతున్నావ‌ని ఇరుకున పెట్ట‌డం.. ఇలా అంటే తాను షో నించి వెళ్లి పోతాన‌ని యానీ మాస్ట‌ర్ అంటే "వెళ్లిపో.." అని ముమైత్ చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సంభాష‌ణ అంతా గ‌మ‌నించి ఓంకార్ "ఎందుకు మీరు ఏక ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? .. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డ్యాన్స్ చేసిన వారికి రెడ్ ఇవ్వ‌డం.. మిస్టేక్‌లు చేసిన వారికి గ్రీన్ ఇవ్వ‌డం ఎందుకు చేస్తున్నారు.. మీ ప‌ద్ద‌తి ఏమీ బాగాలేదు." అ‌ని ఓంకార్.. ముమైత్‌కు వార్నింగ్ ఇచ్చేంత ప‌ని చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ముమైత్ షోలో కొన‌సాగుతుందా?.. లేక బ‌య‌టికి వెళ్లిపోతుందా? అన్న‌ది తెలియాలంటే ఈ వీకెండ్ లో ప్ర‌సారం అయ్యే 'డ్యాన్స్ ప్ల‌స్‌' షో చూడాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.