English | Telugu

వంటలక్క దెబ్బకు మోనితలో వణుకు!

డాక్టర్ బాబు, వంటలక్క కుటుంబంలో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా... డాక్టర్ బాబు చేత తన మెడలో మూడు ముడులు వేయించుకోవడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మోనిత, మరో ఘాతుకానికి ఒడి కట్టింది. డాక్టర్ బాబు తండ్రి ఆనందరావుతో 'మీ అబ్బాయి వల్ల నేను గర్భవతి అయ్యాను' అని చెబుతుంది. దాంతో పెద్దాయనకు గుండెపోటు వస్తుంది. అంతకు ముందు రిజిస్టర్ ఆఫీసులో కలుద్దామని పిలుస్తుంది. తనకు వాళ్ల‌బ్బాయితో పెళ్లి చేయమంటుంది. ఆయన అంగీకరించడు.

'ఈ 25వ తేదీన మీ అబ్బాయి నా మేడలో తాళి కట్టకపోతే మీ పరువు ప్రతిష్టలు రోడ్డున పడతాయి' అని ఆనందరావును మోనిత బెదిరిస్తుంది. అప్పుడు గర్భవతి అయిన విషయం చెబుతుంది. తన కడుపులో బిడ్డకు తండ్రి మీ అబ్బాయేనంటూ ఆనందరావుకు చెప్పడంతో ఆయనకు గుండెపోటు వస్తుంది. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ బాబు, వంటలక్క రిజస్టర్ ఆఫీసుకు చేరుకుంటారు. కోడలికు ఆనందరావు క్షమాపణ చెబుతాడు. తర్వాత ఆయన్ను ఆసుపత్రిలో చేరుస్తారు. కొడుకు చేత ట్రీట్మెంట్ చేయించుకోవడం తనకు ఇష్టం లేదని ఆనందరావు చెబుతారు. స్నేహితుడు గోవర్థన్ చేత తండ్రికి ట్రీట్మెంట్ చేయిస్తాడు డాక్టర్ బాబు. తర్వాత అక్కడ నుండి భార్యతో కలిసి బయటకు వెళ్లాలని బయలుదేరతాడు. ఈలోపు వాళ్ళను మోనిత ఆపుతుంది.

'అర్జెంట్ పని ఉంది. అరగంటలో వచ్చేద్దాం పదా' అని డాక్టర్ బాబు భుజం మీద మోనిత చేయి వేస్తుంది. అతడు తిడతాడు. అయినా పట్టించుకోకుండా కౌగిలించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వంటలక్క 'వెళ్ళండి డాక్టర్ బాబు. అది మిమ్మల్ని పెళ్లి పనులకు పిలుస్తుంది. నేను దాని పెళ్లి పెటాకులు చేసే పనులకు తీసుకువెళ్లాలని అనుకున్నాను. నేను వెళ్తాను గానీ మీరు దాంతో వెళ్ళండి. ఇప్పుడు అంజి ఉన్నట్టయితే బావుండేది' అని అంటుంది. దాంతో మోనితలో వణుకు మొదలవుతుంది. తర్వాత ఏమైందనేది తరువాయి ఎపిసోడ్‌లో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.