English | Telugu
ముమైత్‌కు వచ్చిన లెటర్.. అరబిక్‌లో చదివిన అవినాష్!
Updated : Feb 13, 2021
బుల్లితెరపై మళ్లీ ఓంకార్ హంగామా మొదలైంది. గతంలో 'డ్యాన్ బేబీ డ్యాన్స్' అంటూ డ్యాన్స్ జూనియర్స్.. డ్రామా జూనియర్స్ .. సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడీ, వంటి విభిన్నమైన షోలతో పాపులర్ అయిన ఓంకార్ మళ్లీ తన సత్తాని స్టార్ మాలో చాటుకుంటున్నారు. కొత్తగా డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ 'డ్యాన్స్ ప్లస్' అంటూ సరికొత్త డ్యాన్స్ షోని మొదలుపెట్టారు.
ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. యానీ మాస్టర్, రఘు మాస్టర్, బాబా భాస్కర్, ముమైత్ ఖాన్, మోనాల్ గజ్జర్, యష్ మాస్టర్ ఈ షోకి జడ్జెస్‌గా వ్యవహరిస్తుండగా ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఈ షో శనివారం, ఆదివారాలు ప్రసారం అవుతోంది. ఈ శనివారం షోలో ముక్కు అవినాష్ పోస్ట్‌మ్యాన్‌గా వచ్చి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.
లక్షలు లక్షలు ఖర్చు పెట్టి షో చేస్తూ బాబా భాస్కర్‌కి ఒక్క ప్యాంట్ కూడా కొనివ్వలేదు, అందుకే లుంగీ కట్టుకొని షోకు వస్తున్నారు .. అంటూ అవినాష్ నవ్వులు పూయించాడు. ఇక అరబ్ కంట్రీ నుంచి ముమైత్‌ఖాన్‌కి లెటర్ వచ్చిందంటూ అరబిక్ భాషలో ఆ లెటర్‌ను అవినాష్ చదివిన తీరు అందర్నీ తెగ నవ్వించింది. ముమైత్ అయితే పడీ పడీ నవ్వేసింది. అలా తన పోస్ట్‌మ్యాన్ క్యారెక్టర్‌తో నవ్వులు విరబూయించాడు. అతడి కామెడీని ముమైత్ బాగా ఎంజాయ్ చేసింది.