English | Telugu
జబర్దస్త్‌లో' కార్తీకదీపం' సిస్టర్స్ హంగామా!
Updated : Jul 9, 2022
`కార్తీక దీపం`.. ఓ దశలో టాప్ రేటింగ్ తో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా క్రేజీ సీరియల్ గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడైతే డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలని దర్శకుడు చంపేసి కొత్తగా మళ్లీ మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఈ సీరియల్ కళ తప్పింది. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటు మోనిత పాత్రకు కూడా ఎండ్ కార్డ్ వేసేశాడు దర్శకుడు. ఇక వంటలక్క పిల్లలుగా నటించిన హిమ (సహృద), శౌర్య (బేబి క్రితిక) లను తప్పించి వాళ్ల పాత్రలని పెద్ద వాళ్లుగా మార్చి వీరి స్థానంలో కీర్తి భట్, అమూల్య గౌడలని తీసుకొచ్చాడు.
ఇప్పుడు కథ మొత్తం వీళ్లచుట్టే తిరుగుతోంది. కానీ ఆడియన్స్ ని మాత్రం హిమ (సహృద), శౌర్య (బేబి క్రితిక) తరహాలో ఆకట్టుకోలేకపోతున్నారు. కొన్ని ఎపిసోడ్ లు ఈ ఇద్దరు పిల్లల కారణంగానే రన్నయిందని ప్రచారం జరిగింది. అంతగా క్రేజ్ ని సొంతం చేసుకున్న హిమ (సహృద), శౌర్య (బేబి క్రితిక) లు `కార్తీక దీపం` సీరియల్ నుంచి బయటికి వచ్చేశాక ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడయాలో హంగామా చేస్తున్నా బుల్లితెరపై మాత్రం వీళ్ల సందడిని చాలా మంది మిస్సవుతున్నారట.
ఈ విషయాన్ని మల్లెమాల టీమ్ పసిగట్టిందో, ఏమో తెలియదు కానీ ఈ ఇద్దరిని జబర్దస్త్ షోలోకి తీసుకొచ్చారు. మనో, ఇంద్రజ జడ్జిలుగా, అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్నఈ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్ జూలై 14న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని రీసెంట్ గా విడుదల చేశారు. హిమ (సహృద), శౌర్య (బేబి క్రితిక) లు ఈ షోలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆరంభ ఎపిసోడ్ లోనే శివగామి సిస్టర్స్ గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశారు. హిమ (సహృద), శౌర్య (బేబి క్రితిక) లు హల్ చల్ చేస్తున్న తాజా ప్రోమో నెట్టింట్ వైరల్ గా మారింది.