English | Telugu
ప్రగతి స్టెప్పులకు హైపర్ ఆదికి ఆయాసం
Updated : Jul 9, 2022
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రచ్చ రచ్చ చేస్తోంది. అటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూనే.. బుల్లితెరపై కూడా తనదైన స్టైల్లో హంగామా చేస్తోంది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అత్త పాత్రల్లో నటిస్తున్న ప్రగత నెట్టింట్లో మాత్రం హీరోయిన్ లకు పోటీగా వర్కవుట్ లు చేస్తూ నానా హంగామా చేస్తోంది. ప్రగతి వర్కవుట్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. బుల్లితెరపై కూడా ఇదే తరహాలో రచ్చ చేస్తోందామె. బుల్లితెరపై అదిరిపోయే స్టెప్పులతో దుమ్ముదులిపేస్తున్న ప్రగతి లేటెస్ట్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రీసెంట్ గా ప్రగతి `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి గెస్ట్ గా వెళ్లింది. ఈ షోకు జడ్జిగా పూర్ణ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, వర్ష, బుల్లెట్ భాస్కర్, ఇమ్మానుయేల్, శ్రీవాణి, అన్నపూర్ణ టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. తమదైన స్కిట్ లతో ఆకట్టుకుంటూ నవ్విస్తున్నారు. రష్మీగౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతీ ఆదివారం నవ్వులు పూయిస్తోంది. అయితే జూలై 10న ప్రసారం కానున్న ఎపిసోడ్ ని స్పెషల్ గా ప్లాన్ చేశారు.
`ఆషాడం అల్లుళ్లు` పేరుతో ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ కోసం ప్రగతి గెస్ట్ గా హాజరయ్యారు. స్టేజ్ పై కి చేరి హుషారుగా స్టెప్పులేసి షోని హోరెత్తించారు. "కుర్రాడు బాబోయ్" పాటకు ప్రగతి పదహారేళ్ల అమ్మాయిలా స్టెప్పులేసింది. అయితే తనతో కలిసి హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కూడా డ్యాన్స్ చేశారు. కానీ ఆమె స్పీడుని మ్యాచ్ చేయలేకపోయారు. ప్రగతి స్టెప్పులకు హైపర్ ఆదికి ఆయాసం వచ్చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది.