English | Telugu

 వ‌సుధార‌కు జ‌గ‌తి వార్నింగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. ఫ్యామిలీ ల‌వ్ డ్రామాగా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంత‌గా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అక్ష‌ర గౌడ‌, ముఖేష్ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాయి కిర‌ణ్‌, జ్యోతిరాయ్‌, మిర్చి మాధ‌వి, న‌వ‌భార‌త్ బాలాజీ, చ‌ల్లా సుధీర్‌, ఉష‌శ్రీ, గోపాల్ శ్యామ్‌, విజే రోషిణి, వీణా స్వ‌రూప‌, కిర‌ణ్ కాంత్ త‌దిత‌రులు న‌టించారు.

శుక్ర‌వారం ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. రిషీ సార్ సాక్షితో సినిమాకు ఎలా వెళ్తాడు అని జ‌గ‌తిని వ‌రుధార నిల‌దీస్తుంది. అదే స‌మ‌యంలో వ‌చ్చిన రిషీ త‌న‌కు క్యాబ్ బుక్ చేసిన‌ట్టు చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ఇంత‌లో వ‌సుధార మ‌ళ్లీ మేడ‌మ్ మీ అబ్బాయి అంటుంది. వెంట‌నే జ‌గ‌తి అవును మా అబ్బాయే.. ప్రాబ్ల‌మ్ త‌న‌ది కాదు నీకు నువ్వే ప్రాబ్ల‌మ్ .. ప్రేమ ఎప్పుడు వ్య‌క్తం చేయాల‌న్న‌ది మబ్బుల్లో చంద‌మామ‌లా ఎప్పుడో ఒక‌సారి కాదు అని జ‌గ‌తి .అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

క‌ట్ చేస్తే.. మేడ‌పైన గౌత‌మ్‌, వ‌సుధార వున్నార‌ని తెలిసి రిషీ పైకి వెళ్లిచూస్తాడు. అక్క‌డ వ‌సుధార ని చూసి ఏం చేస్తున్నార‌ని అడిగితే కొలుస్తున్నాం అంటుంది. క్లాస్ ఎగ్గొట్టి ఇక్క‌డ ఏంటి అని రిషి తిట్టికిందికి వెళ్లిపోతాడు. మ‌హేంద్ర రాగానే మీ శిష్యురాలిని కిందికి ర‌మ్మ‌ని చెప్పండి అంటాడు. క‌ట్ చేస్తే జ‌గ‌తి క్లాస్ చెబుతూ వుంటుంది. అదే స‌మ‌యంలో వ‌సుధార .. రిషీ గురించి ఆలోచిస్తూ వుంటుంది. అది గ‌మ‌నించిన జ‌గ‌తి .. క్లాస్ రూమ్ లో ఏంటిది అంటూ వార్నింగ్ ఇస్తుంది. క్లాస్ రూమ్ నుంచి బ‌య‌టికి పంపించేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.