English | Telugu
Karthika Deepam2 : భార్య తాళి తెంపాలని చూసిన భర్త.. అతడు ఏం చేయనున్నాడు!
Updated : May 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -50 లో... నా కూతురు ఫీజు నేను చెల్లిస్తానని దీప అనగానే.. సరే చెల్లించు ఏనబై వేయిలు రూపాయలు ఫీజు అని కార్తీక్ అనగానే అంత ఫీజు ఎలా చెల్లిస్తానని దీప అంటుంది. చెల్లిస్తావ్ నాతో రా అంటూ కార్తీక్ దీప వాళ్ళ రూమ్ కి తీసుకొని వెళ్లి కిచెన్ లో ఉన్న ఒక డబ్బాని తీసుకుని.. నువ్వు నీకు సాధ్యమైనంత డబ్బు ఇందులో వెయ్యి అని కార్తీక్ అంటాడు. ఎన్ని రోజుల్లో ఇస్తావని అంటాడు.
ఆ తర్వాత ఆరు నెలల్లో మీకు ఇస్తాను అని దీప అంటుంది. మీరు నాకు అప్పు ఉన్నట్టు అప్పు ఆరు నెలలో ఇవ్వకపోతే ఆ తర్వాత మీరు నాకు ఇవ్వడం వద్దని కార్తీక్ అంటాడు. నేను ఆరు నెలలో డబ్బులు ఇస్తానని దీప చెప్తుంది. ఇప్పుడు నేను మీ కూతురిని చదివించడం లేదు మీరే చదివిస్తున్నారు.. ఎవరి మాటలు పట్టించుకోండి ఏదైనా తప్పుగా మాట్లాడితే కుక్క అరిచిందని సైలెంట్ గా ఉండండి అని దీపకి కార్తిక్ చెప్తాడు. వాళ్ళ మాటలన్నీ పారిజాతం వింటుంది. వీడు నన్నె అంటున్నాడని అనుకుంటుంది. ఆ తర్వాత నర్సింహా స్కూల్ కి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ ని కార్తీక్ ఎందుకు వచ్చాడోనని అడుగుతాడు. ఆ పాప తండ్రి అతను కాదన్నావ్.. అతనే అడ్మిషన్ ఫోమ్ లో తండ్రి పేరు దగ్గర అతని పేరు రాసాడు. ఇదిగో ఫొటో తీసుకొని వచ్చానని ఫోన్ లో అడ్మిషన్ ఫామ్ చూపిస్తాడు. అందులో కార్తీక్ పేరు చూసి షాక్ అవుతాడు. అసలు పాప నా కూతురా వాడి కూతురా అని దాన్నే అడిగి తెలుసుకుంటానని నర్సింహా అనుకుంటాడు.
శౌర్యకి దీప అన్నం తినిపిస్తూ పారిజాతం అన్న మాటలు గుర్తుకుచేసుకుంటుంది. మరుసటి రోజు దీప హోటల్ దగ్గర టిఫిన్స్ కి అన్ని రెడీ చేస్తుంటుంది. అప్పుడే నర్సింహా వచ్చి స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి వాడు ఎందుకు వెళ్లాడు.. తండ్రి పేరు దగ్గర వాడి నేమ్ ఎందుకు రాసాడు.. పాప తండ్రి వాడేనా అని నర్సింహా అడగ్గానే దీప కోప్పడుతుంది. నీకు నాకు సంబంధం లేనప్పుడు, నీకెందుకని దీప అంటుంది. అలా అయితే నా తాళి ఇవ్వమని నర్సింహా లాగబోతుంటే దీప ఆపుతుంది. కడియం కూడా ఆపే ప్రయత్నం చేస్తాడు. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అంటు ఇద్దరు బెదిరిస్తారు. అదంతా దూరం నుండి కార్తీక్ చూస్తాడు. నర్సింహా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీడిని ఇలా కాదు అంటూ కార్తీక్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఒకడిని బెదిరించాలని చెప్తాడు. ఆ తర్వాత నర్సింహా చేసిన దానికి దీప ఏడుస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.