English | Telugu

Eto Vellipoyindhi Manasu : గోరింటాకు పండితే ఆయనకు నాపై ప్రేమ ఉన్నట్టే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'( Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -199 లో... సీతాకాంత్ ని రామలక్ష్మి అటపట్టిస్తూ పైకి వస్తుంది. అప్పుడే సందీప్, శ్రీవల్లి, శ్రీలత లు రామలక్ష్మి గురించి మాట్లాడుకోవడం రామాలక్ష్మి వింటుంది. ఇలాగే ఉంటే ఆ రామలక్ష్మి బాబో పాపనో కని మనల్నే ఆడించమన్నటుందని శ్రీవల్లి అంటుంది. నీకు నాపై నమ్మకం లేదోమో గాని నాకు సీతాపై చాల నమ్మకం ఉంది పక్షం రోజులు కాదు.. నేను ఎన్ని రోజులు తన భార్యకి దూరంగా ఉండమంటే అన్ని రోజులు ఉంటాడని శ్రీలత అంటుంది.

అదంతా విన్న రామలక్ష్మి కావాలనే వాల్ల దగ్గరికి వెళ్లి మా అయన గదిలోకి రమ్మని ఒకటే సత్తాయిస్తున్నాడు అత్తయ్య గారు... దూరం ఉండమన్నారని అన్నా కూడ వినట్లేదు.. అందుకే నాకోసం వెతుక్కుంటూ వస్తున్నాడు.. నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పకండి అని రామలక్ష్మి అని వెళ్లి కర్టైన్ వెనకాల దాక్కుంటుంది. అప్పుడు సీతాకాంత్ వచ్చి రామలక్ష్మి ఎక్కడా.. పని చెయ్యకు అంటే వినట్లేదని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి కర్టైన్ వెనకాల ఉండడం చూసి తీసుకొని వస్తాడు. నీ చేతులు కట్టేస్తే గానీ నువ్వు సైలెంట్ గా ఉండవని సీతాకాంత్ అనగానే.. పని చేయకుండా ఉండాలంటే కట్టేయడం ఎందుకు? చేతికి గోరింటాకు పెడితే సరిపోతుందని సీతాకాంత్ తో శ్రీవల్లి అంటుంది. అలా అనగానే మంచి ఐడియా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నువ్వేంటి వాళ్ళు కలిసేలా ఐడియా ఇస్తున్నావని సందీప్ అనగానే నేనొక ప్లాన్ చేసాను. అది మీకు చెప్పానని శ్రీవల్లి అంటుంది.

ఆ తర్వాత శ్రీవల్లి గోరింటాకులో దురద మంట పుట్టే కెమికల్ ఆడ్ చేస్తుంది. అది ఒకటి రామలక్ష్మికి.. ఒకటి కెమికల్ లేనిది నాకు అంటూ పెడుతుంది. పైకి వెళ్తుంటే సందీప్ డాష్ ఇస్తాడు. అప్పుడు కోన్ లు మారిపోతాయ్. సీతాకాంత్ కి మంచి కోన్ ఇస్తుంది.‌ ఆ తర్వాత సందీప్ తో తను కోన్ వేయించుకుంటుంది.‌ అయ్యో మంట అంటు శ్రీవల్లి ఏడుస్తూ.. అటు ఇవ్వాలిసింది ఇటు వచ్చిందంటుంది. మరొకవైపు సీతాకాంత్ రామలక్ష్మికి కోన్ వేస్తాడు. అప్పుడే సిరి వచ్చి సరదాగా మాట్లాడి వెళ్ళిపోతుంది. నా ప్రేమ నిజమైతే ఈ మెహందీ బాగా పండాలని సీతాకాంత్ అనుకుంటాడు. ఆయన మనసులో నాకు స్థానం ఉంటే బాగా పండుతుందని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.