English | Telugu
కాపాడింది రిషి కాదు రంగా.. వసుధారని పూడ్చిపెట్టేశారా!
Updated : Jun 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1102 లో.. వసుధార స్పృహ లోకి వచ్చి.. రిషి సర్ అంటూ రిషిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక్కసారిగా రిషి దగ్గరికి వెళ్లి సర్ అంటూ హగ్ చేసుకుంటుంది. నాకు తెలుసు సర్ మీరున్నారని.. నా నమ్మకం నిజం అయిందని వసుధార అంటుంటే.. ఎవరండి మీరు? నేను రంగా అండి.. రిషి సర్ ఏంటి ? మిమ్మల్ని రౌడీల నుండి కాపాడానని రిషి అంటాడు. లేదు నా రిషి సారే మీరు అంటు వసుధార మళ్ళీ హగ్ చేసుకోబోతుంటే.. ఎయ్ ఎవరు నువ్వు మా బావ రంగని ముట్టుకుంటావ్ ఏంటని సరోజ ఆపుతుంది. ఆ తర్వాత మళ్ళీ వసుధార స్పృహ కోల్పోతుంది.
ఏంటి ఈవిడ నా బావని ముట్టుకుంటుందని సరోజ అంటుంది. దెబ్బ తాకితే గతం మర్చిపోతారని విన్నాను కానీ ఇలా వేరేవాళ్లని తన వాళ్ళు అనుకుంటారా అని సరోజ అంటుంది. దీన్ని కొంచెం మా బావకి దూరం గా ఉంచాలని సరోజ అనుకుంటుంది. మరొకవైపు ఆ రౌడీ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే ధరణి వచ్చి ఎందుకు టెన్షన్ పడుతున్నారు.. ఏమైందని అడుగుతుంది. ధరణి నేను టెన్షన్ లో ఉన్నాను నన్ను కదిలించకని శైలేంద్ర అంటాడు. నా బిజినెస్ పార్టనర్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని శైలేంద్ర అనగానే.. మీరు ఏం బిజినెస్ చెయ్యట్లేదు కదా అని ధరణి అంటుంది. అంటే ఇక్కడ కాదు ఫారెన్ లో అని శైలేంద్ర కవర్ చేస్తాడు. ఆ తర్వాత ధరణి వెళ్ళిపోతుంది. మరొకవైపు రౌడి శైలేంద్రకి ఫోన్ చేస్తున్నాడని టెన్షన్ పడతాడు. వసుధార చనిపోయిందని శైలేంద్రని నమ్మించేలా ఒక బొమ్మని తీసుకొని వచ్చి దాన్ని సగం వరకు పుడ్చేస్తాడు. అప్పుడు శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి మీరు చెప్పిన పని పూర్తి అయిందని రౌడీ చెప్పగానే.. శైలేంద్ర నమ్మకుండా వీడియో కాల్ చేసి చూపించు అనగానే రౌడీ వీడియో కాల్ లో బొమ్మని పుడ్చేసింది చూపిస్తాడు. మొహం కన్పించడం లేదని శైలేంద్ర అంటాడు. దాంతో ఆ రౌడీ ఏదో ఒకటి కవర్ చేసి ఫోన్ కట్ చేస్తాడు.
ఆ తర్వాత శైలేంద్ర స్నానం చేసి వచ్చి ధరణి, దేవయానీలని పిలిచి.. తల స్నానం చెయ్యమని చెప్తాడు. ఎందుకని దేవాయని అడుగగా ధరణికి వినపడకుండా.. ఇప్పుడే వసుధారని చంపించేసానని చెప్తాడు. ఆ తర్వాత ఫణీంద్ర వచ్చి.. ఈ స్నానం గొడవ ఏంటని అడగగా.. ఏదో ఒకటి కవర్ చేస్తుంది దేవయాని. ఆ తర్వాత అసలు ఈ మను బాబాయి కొడుకే.. ఆ వసుధరా వెళ్తూ ఈ లెటర్ మనుకి రాసింది. ఇందులో మను తండ్రి బాబాయ్ అని ఉందని శైలేంద్ర చెప్పి లెటర్ దేవయానికి ఇస్తాడు. అది చదువుతూ దేవయాని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.