English | Telugu

Illu illalu pillalu: శ్రీవల్లి చేసిన పనికి నర్మద, సాగర్ బుక్ అవుతారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 198 లో.. భాగ్యం, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. అమ్మడూ ఊరకే కంగారు పడకు.. బ్యాంక్‌లో బంగారం తాకట్టు పెట్టేటప్పుడు మాత్రమే ఒరిజినలా కాదా అని చెక్ చేస్తారు.. అంతే తప్ప దాచుకోవడానికి, లాకర్‌లో పెట్టేటప్పుడు కాదని శ్రీవల్లితో భాగ్యం అంటుంది భాగ్యం. బతికించావే అమ్మా.. ఎక్కడ మన బండారం భయపడి చచ్చానే అమ్మా అని శ్రీవల్లి అంటుంది. బ్యాంక్ వాళ్లు చెక్ చేయరు కదా అని అజాగ్రత్తగా ఉండకు.. వాటిని ఎవరైనా పరిశీలనగా చూస్తే అవి రోల్డ్ గోల్డ్ అని కనిపెట్టే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని ఎవరూ చూడకుండా మూటగట్టి ఇచ్చేయ్ అని భాగ్యం అంటుంది‌. ఇంతలో వేదవతి పిలివడంతో.. సరేనమ్మా అంటూ నగల్ని మూటకట్టేస్తుంది శ్రీవల్లి.

అప్పటికే నర్మద, ప్రేమ ఇద్దరు తమ నగల్ని వేదవతికి ఇస్తారు‌. శ్రీవల్లి మూట తీసుకురాగానే వేదవతి దాన్ని విప్పమని చెప్తుంది. దాంతో శ్రీవల్లి కంగారుపడుతుంది. ఇక వేదవతితో పాటు నర్మద, ప్రేమ అనుమానంతో చూస్తారు. ఆ నగలు రోల్డ్ గోల్డ్ లా ఉన్నాయని నర్మద అనుమానపడుతుంది. దాంతో శ్రీవల్లి తెగ నటించేస్తుంది. ఇంతలో తిరుపతి వచ్చేస్తాడు. బావ బంగారం తీసుకురమ్మని చెప్తున్నాడని తిరుపతి అనగానే.. అందరి నగల్ని తీసుకెళ్తుంది వేదవతి. ఇక రాత్రివేళ నర్మద తన చీరకొంగులో సీక్రెట్ గా ఏదో తీసుకెళ్తుంది‌‌. అది శ్రీవల్లి చూసి ఏంటని అడుగగా.. తనకి ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంది నర్మద. ఇంతకీ ఆమె చీర చెంగులో ఉన్నది ఏంటంటే.. సాగర్ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ కావడానికి బుక్స్. ఎవరికీ కనిపించకుండా బుక్స్‌ని తీసుకొచ్చి సాగర్‌‌కి ఇస్తుంది. నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని అన్నావ్ కదా.. ఎగ్జామ్స్‌లో పాస్ కావాలంటే బుక్స్ చదవాలి కదా... ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నాయని సాగర్ తో నర్మద చెప్తుంది. అమ్మ బాబోయ్ ఇన్ని బుక్స్ చదవాలా. ఇది నా వల్ల అవుతుందా.. నాకు ఉద్యోగం వస్తుందంటావా అని సాగర్ అంటాడు. మీకు నేనున్నా కదా శ్రీవారూ.. మీతో చదవిస్తా కదా అని నర్మద అంటుంది.

ఇక మొదలుపెడదామా శ్రీవారూ అని నర్మద అనగానే నువ్వు ఊ అంటే నేనూ ఊహూ అంటానా.. ఆల్రెడీ బెడ్ కూడా సర్దేశా.. పద మొదలుపెడదామని సాగర్ అంటాడు. నేను చెప్పింది చదవడం గురించి శ్రీవారూ అని నర్మద అంటే.. అంతకంటే ముందు నిన్ను ప్రేమగా చదివి అప్పగించాలి కదా అని నర్మదతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు సాగర్. ఆగండి శ్రీవారూ.. గవర్నమెంట్ జాబ్‌లు ఊరికే రావు.. దృష్టి బుక్స్‌పై పెట్టు.. నా మీద కాదు అంటూ సాగర్‌ని దగ్గరుండి చదివిస్తుంది నర్మద. అతనికి అర్థం అయ్యేట్టుగా సబ్జె‌క్ట్‌ని చదివి వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.