English | Telugu

Karthika Deepam 2 : జీతం పెంచమన్న వర్కర్స్.. సాల్వ్ చేసిన కార్తీక్!

 

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -390 లో... శ్రీధర్ స్నానం చేసి వచ్చేసరికి తన లుంగీ కన్పించదు. లుంగీ ఎక్కడ అని కావేరిని అడుగుతాడు. అయ్యో ఇప్పుడే మన అల్లుడు గారికి ఇచ్చానండి అని కావేరి చెప్పగానే.. నా లుంగీ ఎందుకు ఇచ్చావని శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. కాశీ దగ్గరికి శ్రీధర్ వెళ్లి అడుగుతాడు. ఛీ చీప్ గా లుంగీ గురించి గొడవ ఏంటని స్వప్న అంటుంది. అవసరం అయితే కాస్ట్ చెప్పు ఇస్తానని స్వప్న అంటుంది. నాకు క్యాష్ వద్దు ఆన్లైన్ పేమెంట్ కావాలని శ్రీధర్ అనగానే ఈయన మారరని స్వప్న కోప్పడుతుంది.

 

ఆ తర్వాత శివన్నారాయణ ఇంటికి వర్కర్స్ వచ్చి జీతం పెంచాలని గొడవ చేస్తారు. మీరు కనుక జీతం పెంచకుంటే స్ట్రైక్ చేస్తామని చెప్పి వెళ్తారు. అదంతా దీప, కార్తీక్ వింటారు. జ్యోత్స్న పై శివన్నారాయణ కోప్పడతాడు. బావ సమస్యకి పరిష్కారం చెప్పండి అని కార్తీక్ ని దీప అడుగుతుంది. నేను చొరవ తీసుకోలేనని కార్తీక్ అంటాడు. దాంతో నేను చొరవ తీసుకుంటానని వెళ్లి దీనికి పరిష్కారం మా బావ చెప్తాడని శివన్నారాయణకి చెప్తుంది. అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ టాలెంట్ తెలుసు కదా నాన్న అని కార్తీక్ గురించి దశరథ్ గొప్పగా చెప్తాడు. దాంతో శివన్నారాయణ సరే అంటాడు. ఒకవేళ ఫెయిల్ అయితే కోటి రూపాయలు ఇవ్వాలని అంటారు. ఒకవేళ సక్సెస్ అయితే అని దీప అనగానే.. మీరు ఏది అడిగితే అది చేస్తానని  శివన్నారాయణ అంటాడు.

 

ఆ తర్వాత వర్కర్స్ తో కార్తీక్ మాట్లాడతాడు. మీకు ఇప్పుడు జీతం పెంచలేము. మీకు వడ్డీ లేని ఋణం ఇస్తాం.. ఇంకా ఎంత ప్రాఫిట్ వస్తే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని కార్తీక్ అనగానే వర్కర్స్ సరే అంటారు. దాంతో శివన్నారాయణ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత శివన్నారాయణ కార్తీక్ ని లోపలికి పిలుస్తాడు. అందరు లోపలికి వెళ్తుంటే పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేసి గొడవ సర్దుమణిగింది కదా అని అంటాడు. నీకేలా తెలుసు అని పారిజాతం అనగానే అందులో నా మనిషి ఉన్నాడులే అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.