English | Telugu
కూలీ పనిచేస్తూ కన్పించిన అనసూయ!
Updated : Aug 28, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -134 లో....కాంచన చైన్ చూపించి ఇది ఎవరిది అని అడుగుతుంది. నన్ను చిన్నప్పుడు ఒక అమ్మాయి కాపాడిందని తెలుసు కదా.. ఆ అమ్మాయి చైన్.. అనుకోకుండా నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడా ఉందో ఆమెకి సాయం చెయ్యాలి.. ఒకవేళ దీప లాంటి పరిస్థితిలో ఉందేమోనని కార్తీక్ అంటాడు. అందరూ అల ఎందుకు ఉంటారు. అందరు నర్సింహాలాగా ఉంటారా? మీ నాన్న లాంటి వాళ్ళు కూడా ఉంటారని కాంచన అంటుంది. నాన్న గురించి నీకు తెలిస్తే తట్టుకోలేవని కార్తీక్ అనుకుంటాడు. ఆ అమ్మాయి ఎదురుపడాలని కోరుకుంటున్నానని కాంచన అంటుంది.
మరొకవైపు దీప వెళ్తుంటే అనసూయ కూలి పని చేస్తూ కన్పిస్తుంది. తనని చూసి అత్తయ్య మీరు ఇక్కడ ఉన్నారేంటి? నాతో రండి అని అంటుంది. నేను రాలేను కోర్ట్ లో జరిగిన దానికి వాళ్ళు నన్ను బయటకు పంపిస్తారని తెలుసు.. అందుకే నేనే బయటకు వచ్చేసానని అనసూయ అంటుంది. నాతో పాటు ఉండండి అని దీప రిక్వెస్ట్ చేస్తుంది. దంతో అనసూయ నేను వస్తానులే నువ్వు వెళ్ళనని అంటుంది. మరొకవైపు కోర్ట్ చుట్టు తిరిగిన ఖర్చు అంత లెక్క రాసిపెడుతుంది శోభ. ఇవన్నీ ఇస్తేనే కార్ కీస్ ఇస్తానని నరసింహాతో అనగానే సరే ఊళ్ళో నా ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తానని నరసింహ అంటాడు. ఆ తర్వాత స్వప్నతో కాశీ గురించి మాట్లాడతాడు కార్తీక్. నువ్వు ఏదైనా జాబ్ చూసుకోమని చెప్తాడు. నువ్వు మీ లవ్ గురించి మీ డాడ్ తో చెప్పవా అని కార్తీక్ అడుగుతాడు.. లేదు మా డాడ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడని డౌట్ గా ఉందని స్వప్న అంటుంది. ఆ తర్వాత నువ్వు బిజినెస్ చేస్తా అన్నావ్.. నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తానని స్వప్నకి కార్తీక్ చెప్తాడు.
ఆ తర్వాత దీప దగ్గరికి అనసూయ వస్తుంది. అనసూయని చూసి తన వెంట నరసింహా వచ్చాడని శౌర్య భయపడుతుంది. అనసూయ రావడంతో దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే విషయం సుమిత్ర దగ్గరికి దీపవెళ్లి చెప్తుంది. నాతో పాటు ఇక్కడే ఉంటుందని దీప అడుగుతుంది. అందుకు సుమిత్ర ఒప్పుకొని.. వచ్చి దీపకి సపోర్ట్ చేసినందుకు థాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత శౌర్య టాబ్లెట్ అయిపోతే దీప తీసుకొని రావడానికి వెళ్తుంటే.. నేను వెళ్తానని అనసూయ అంటుంది. దీప డబ్బులు ఇస్తుంటే నా దగ్గర ఉన్నాయని అనసూయ వెళ్తుంది. దాంతో దీప తన దగ్గర అనసూయ డబ్బులు లాక్కున్న రోజులు గుర్తుచేసుకొని ఇప్పుడు బాధ్యతగా ఉన్నారు అత్తయ్య.. హ్యాపీగా ఉందని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.