English | Telugu
Guppedantha Manasu:ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న వసుధార.. ఆ మాటలన్నీ వాడు వినేసాడు!
Updated : Jan 19, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -977 లో.. ఆఫీస్ వర్క్ చేస్తున్న వసుధార దగ్గరికి అనుపమ, మహేంద్ర వచ్చి.. ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు. లేదు మావయ్య ఇప్పటి వరకు రిషి సర్ ఫోన్ మాట్లాడి కొన్ని సజెషన్స్ ఇచ్చారని వసుధార చెప్తుంది. రిషి సర్ పక్కన ఉండి ఇద్దరం కలిసి వర్క్ చేస్తుంటే టైం తెలిసేది కాదు. నాకు అన్ని విషయాల్లో రిషి సరే సపోర్ట్, ధైర్యమని రిషిపై ప్రేమని మాటల్లో చెప్తుంటుంది. అది వింటూ అనుపమ మహేంద్ర ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత రిషికి నీకు అసలు పరిచయం ఎలా మొదలు అయిందని అనుపమ అడుగుతుంది. నేను ఒక స్టూడెంట్ గా ఈ కాలేజీలో అడుగుపెట్టాను. మొదటగా కాలేజీలో స్థానం లేదన్నాడు. అలాంటిది తన మనసు లో స్థానం ఇచ్చాడంటూ రిషి ప్రపోజ్ చేసిన జ్ఞాపకాలు గుర్తుకుచేసుకుంటుంది వసుధార. అలా తమ ప్రేమ జ్ఞాపకాలు అన్ని అనుపమ, మహేంద్రలకి చెప్తుంది వసుధార. రిషి సర్ నాకు జీవితంలో దొరికిన అరుదైన బహుమతి అని వసుధార చెప్తుంది. రిషి నీకు దొరకడం నీ అదృష్టమని మహేంద్ర అంటాడు. వసుధార కూడా రిషికీ దొరకడం రిషి అదృష్టమే అని అనుపమ అంటుంది. ఎన్ని కష్టలు ధాటి రిషిని కలిసావు రిషి కోసం ఎంత వెతికావని అనుపమ అంటుంది.. వాళ్ళ మాటలన్నీ చాటు నుండి రాజీవ్ వింటుంటాడు. అసలు రిషికి ఏమైందని రాజీవ్ అనుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర వెళ్ళిపోతాడు. నేను కాఫీ తీసుకొస్తానంటు అనుపమ వెళ్తుంది. వసుధారని చాలా రోజుల తర్వాత చూస్తుంటాడు రాజీవ్. వసుధారని కిటికీ పక్కన నుండి రాజీవ్ చూస్తుంటే.. వసుధారకి ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. వసుధారని సరిగా చూడాలని బయటకు వెళ్లి డోర్ దగ్గర కర్ర వేస్తాడు. ఆ సౌండ్ కి వసుధార బయటకు వస్తుంది. వసుధారని చూసిన రాజీవ్.. ఏం అందం అంటు చాటు నుండీ సెల్ఫీ తీసుకొని వసుధారకి కన్పించకుండా వెళ్ళిపోతాడు.
భద్రని దేవయాని పిలిచి మాట్లాడుతుంది. దేవయాని డబ్బులు ఇస్తే భద్ర తీసుకోడు. ఇకనుండి ఆ ఇంట్లో ఏం జరిగిన నాకు చెప్పాలని భద్రకి చెప్తుంది. అప్పుడే అటుగా ధరణి వస్తుంటే.. నువ్వు వెళ్ళిపోమంటూ భద్రని పంపిస్తుంది. భద్రని వెనకాల నుండి చూసిన ధరణి.. అతనెవరని దేవయానిని అడుగుతుంది. ఎవరో సేల్స్ బాయ్ అంటూ కవర్ చేస్తుంది దేవయాని. కానీ దేవయాని కంగారు వల్ల ధరణికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత వసుధార దగ్గరికి అనుపమ, మహేంద్ర వస్తారు. ఇంకా ఎన్ని రోజులు నా కొడుకుకి దూరంగా ఉండాలి. ఇప్పుడు నన్ను రిషి దగ్గరకి తీసుకొని వెళ్ళమని మహేంద్ర అంటాడు. ఇప్పుడు రిషి గురించి చెప్పడం లేదంటే తన కోసమే కదా అంటు అనుపమ అన్నా కూడా మహేంద్ర వినకుండా.. ఇప్పుడు రిషి దగ్గరికి వెళదామని అంటాడు. వాళ్ళ మాటలన్ని భద్ర వింటు ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.