English | Telugu

ఐటమ్స్ సాంగ్ తో రమ్య కృష్ణ ఎంట్రీ 

జయమ్ము నిశ్చయమ్మురా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి రమ్య కృష్ణ ఎంట్రీ ఇవ్వబోతోంది. హోస్ట్ జగ్గు భాయ్ ఇంటరెస్టింగ్ ప్రశ్న అడిగారు. "మళ్ళీ చేయాలి అనుకునే సినిమా ఏది" అనేసరికి " నేను చేసిన ఐటెం నంబర్స్ అన్నీ మళ్ళి చేయాలి" అని చెప్పింది. "చిన్నదమ్మే చీకులు కావా" అంటూ సాంగ్ కూడా పాడింది. "షాట్ ఎంత సేపైనా కానీ పొట్ట అలా లోపలకి పెట్టేయడం షాట్ కట్ అనగానే పొట్ట అలా బుస్స్" అంటూ కామెడీగా షూటింగ్ టైములో పొట్టను ఎలా మేనేజ్ చేయాల్సి వచ్చేదో చెప్పుకొచ్చింది.

"బాహుబలిలో అవకాశం ఎలా వచ్చింది" అని అడిగేసరికి "శోభా గారు ఫోన్ చేసి 40 డేస్ అన్నారు. అయ్యో 40 డేస్ ఆ నా వల్ల కాదు శోభా గారు సారీ" అని చెప్పి ఫోన్ పెట్టేసాను. "బిగ్ బడ్జెట్ ఫిలిం అని అంతే తెలుసు.. బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకుని అలా కూర్చుంటే అసలు నాకే రాజమాత అనిపించింది.. ఇదే నా మాటా.. నా మాటే శాసనం" అంటూ బాహుబలి సిగ్నేచర్ డైలాగ్ ని రమ్య కృష్ణ మళ్ళీ ఈ అంత పవర్ ఫుల్ గా చెప్పేసరికి జగపతి బాబుతో పాటు ఆడియన్స్ అంతా కూడా ఫుల్ లేచి నిల్చుని మరీ చప్పట్లు కొడుతూ అరిచారు. బాహుబలి అంటే ప్రభాస్ అనుకుంటారంతా కానీ ప్రభాస్ ని మించి వన్ లేడీ షోలా ఉంటుంది ఈ సినిమా. సినిమా మొత్తం రాజమాత మాత్రమే కనిపిస్తుంది. ఆ మాటే వినిపిస్తుంది. ఈ మూవీతో రమ్యకృష్ణ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.