English | Telugu
Suman Shetty Buzz Interview: చాలా పెద్ద తప్పు చేశావ్.. సుమన్ ని నిలదీసిన శివాజీ..!
Updated : Dec 14, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో 14వ వారం వీకెండ్ వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయ్యాడు. ఇది ఎవరు ఊహించని విధంగా జరిగింది.
ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చేసిన సుమన్ శెట్టి బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక సుమన్ శెట్టి వచ్చీ రాగానే.. జయం సినిమాలోని 'శబ్బాసి శబ్బాసే' అనే బిజిఎమ్ తో అదరగొట్టాడు ఎడిటర్. ఇంటర్వ్యూలో ఏది అడిగినా దానికి నిజమే చెప్తానని అబద్ధం చెప్పనని ప్రమాణం చేస్తున్నానని శివాజీ అనగా.. ఏది అడిగినా అబద్ధం చెప్పనని సుమన్ శెట్టి అన్నాడు.
ఇక ఇంటర్వ్యూ మొదలెట్టాడు శివాజీ. కళ్యాణ్ , ఇమ్మాన్యుయేల్ కి బ్యాంకాక్ కి తీసుకెళ్తానని మాటిచ్చావంట కదా అని శివాజీ అడుగగా.. అన్నా అవన్నీ ఇప్పుడెందుకు అన్నా అని సుమన్ శెట్టి అన్నాడు. మనలో మన మాట.. అసలు నువ్వు ఈ హౌస్‌లో ఇన్ని రోజులు ఉంటావని అనుకున్నావా? అని శివాజీ అడుగగా.. లేదన్నా అని సుమన్ శెట్టి అన్నాడు. నువ్వే కాదు.. మేం కూడా అనుకోలేదని శివాజీ అన్నాడు.
ఎందుకని నీ పిలకని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టావంటూ శివాజీ అడుగగా.. సుమన్ శెట్టి ఆశ్చర్యపోయాడు. చాలా పెద్ద తప్పు చేశావ్ సుమన్ నువ్వు.. ఎవరూ చేయకూడని తప్పు చేశావ్.. ఎందుకు చేశావ్ అలా.. ఏమీ ఆలోచించవా.. ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తావా అని శివాజీ అడిగాడు. ముందు తప్పేంటే చెప్తే.. చేశానో లేదో చెప్తానని సుమన్ శెట్టి అన్నాడు.
సుమన్ శెట్టి హౌస్ లో పెద్దగా ఆడకపోయినా 14వ వారం వరకు బిగ్ బాస్ ఉంచాడు అనేది కొందరి అభిప్రాయం. అలాంటిది చేయకూడదని తప్పు అంటే అదేం ఉండదు.. ఏదో హైప్ ఇవ్వడం కోసం.. టీఆర్పీ కోసం శివాజీ చేత అడిగించినట్టున్నారు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరి సుమన్ శెట్టి నిజంగానే తప్పు చేశాడా? ఒకవేళ చేస్తే అదేంటో తెలియాలంటే బజ్ ఇంటర్వ్యూ (Suman Shetty Buzz interview) ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.