English | Telugu
అలాంటి అబ్బాయిలంటే ఇష్టం.. త్వరలో ఒక పెద్ద షోలో...
Updated : Feb 3, 2026
మంచి కామెడీ టైమింగ్ తో, పంచులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఫైమా. ఆమె స్కిట్స్ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఫైమా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది.
"జిమ్ బాయ్స్, బిజినెస్ మెన్, గడ్డం ఉన్న వాళ్ళు అసలు ఇష్టం లేదు. పొడవుగా ఉన్న వాళ్ళు ఇష్టం. కర్లీ హెయిర్, పిల్లి కళ్ళు వాళ్ళు కొరియన్ బాయ్స్ ఎవరూ ఇష్టం లేదు. నా అభిప్రాయంలో పెళ్లి చేసుకోవడమే మంచిది. ఏ ఏజ్ వచ్చినా లాస్ట్ కి పెళ్లి జరగాల్సిందేగా. అదేదో ముందే చేసేసుకుంటే ఐపోతుందిగా అని నా ఫీలింగ్. ఎక్కువగా భార్య వలన సమస్యలు వస్తాయని నా ఫీలింగ్.
నా పక్కన కామెడీ చేయడానికి బెస్ట్ కంబినేషన్ అంటే భాస్కర్ , నూకరాజు, నరేష్ ముగ్గురూ బెస్ట్. అందరితో చేసాను. కానీ నరేష్ నేను కలిస్తే దుమ్ము దులిపేస్తాం. అవుట్ ఆఫ్ లైన్ చేస్తున్నానని ఎవరూ అనలేదు. అంటే లేడీ కమెడియన్స్ చాలామంది ఉన్నారు. ఏదైనా లైన్ ఇచ్చినప్పుడు నా ఓన్ స్టైల్ లో చేస్తాను. బయట కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు కదా. గయ్యాళి లాంటి రోల్స్ మనకు బయట కూడా కనిపిస్తాయి కదా.
ఇక షోస్ గురించి చెప్పాల్సి వస్తే నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీలో, జబర్దస్త్ లో, బయట షోస్ లో చూసారు. ఇక ఇప్పుడు ఒక కొత్త షోలో ఒక పెద్ద స్టేజి మీద రాబోతున్నా.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారు ఈ షోలో కూడా అలాగే సపోర్ట్ చేయాలనీ అనుకుంటున్నాను." అని ఫైమా చెప్పుకొచ్చింది.